Gold News: సావరిన్ గోల్డ్ బాండ్స్ విక్రయ ధర ప్రకటించిన RBI.. లాభం ఎంతంటే..??
Gold Bonds: దేశంలో భౌతిక బంగారానికి డిమాండ్ తగ్గించాలని రిజర్వు బ్యాంక్, కేంద్ర ప్రభుత్వం నిర్ణయించాయి. అందుకే పెట్టుబడిదారులకు వీలుగా డిజిటల్ గోల్డ్ కొనుగోలుకు సావరిన్ గోల్డ్ బాండ్లను జారీ చేసింది.
తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మొదటి సిరీస్ సావరిన్ గోల్డ్ బాండ్(SGB) విక్రయించాలనుకునే వారికోసం ధరను ప్రకటించింది. 2015లో విక్రయించిన గోల్డ్ బాండ్స్ తొరి సిరీస్ రిడెంప్షన్ నవంబర్ 30, 2023న షెడ్యూల్ చేయబడింది. అయితే ఈ బాండ్లను 8 ఏళ్ల తర్వాత తిరిగి చెల్లింపుకు సిద్ధమయ్యాయి. అందుకే దీనికోసం రిజర్వు బ్యాంక్ యూనిట్ విక్రయ ధరను రూ.6,132గా నిర్ణయించినట్లు ప్రకటించింది.

భారత ప్రభుత్వం, రిజర్వు బ్యాంక్ గోల్డ్ బాండ్లను తొలిసారిగా దేశీయ ఇన్వెస్టర్ల కోసం తీసుకొచ్చిన సమయంలో గ్రాము బంగారం ధర రూ.2,684గా నిర్ణయించటం జరిగింది. అప్పటి మార్కెట్ ధరకు అనుగుణంగా దీనిని నిర్ణయించారు. అయితే ప్రస్తుతం దేశంలో బంగారం రిటైల్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. అప్పటి ధరకి దాదాపు డబుల్ అయ్యాయి. అప్పట్లో గోల్డ్ బాండ్లను నవంబర్ 20, 2015 నుంచి నవంబర్ 30, 2015 మధ్య కాలంలో వీటిని జారీ చేయటం జరిగింది.
ఈ సావరిన్ గోల్డ్ బాండ్లలో 2015లో పెట్టుబడులు పెట్టిన ఇన్వెస్టర్లు మంచి లాభాలను ఆర్జించారు. ఉదాహరణకు ఒక పెట్టుబడిదారుడు సావరిన్ గోల్డ్ బాండ్ మొదటి సిరీస్‌లో 35 గ్రాముల బంగారాన్ని తీసుకున్నట్లయితే.. దీని కోసం అతడు మెుత్తంగా రూ.93,940 ఖర్చుచేశారు. ఇక్కడ అప్పుడు ఒక్కో గ్రాము ధర రూ.2,684గా నిర్ణయించబడిందని గుర్తించాలి. ప్రస్తుతం రిజర్వు బ్యాంక్ నిర్ణయించిన తాజా ధర ప్రకారం 35 గ్రాముల బంగారం ధర రూ.2,14,620కి చేరుకుంటుంది. ఈ లెక్కన సావరిన్ గోల్డ్ బాండ్ సదరు పెట్టుబడిదారులకు 128.5 శాతం రాబడిని అందించింది. CAGR ప్రకారం ఇది 10.8 శాతంగా ఉంటుంది.


Click it and Unblock the Notifications