Notes Ban: దేశ ప్రజలకు కేంద్రం మరోసారి షాక్.. 2 వేల నోట్లు రద్దు దిశగా RBI సర్క్యులర్
Notes Ban: పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో దేశ ప్రజలకు ప్రధాని మోడీ గతంలో గట్టి షాక్ ఇచ్చారు. సామాన్యుల నుంచి ధనవంతుల వరకు వాటిని మార్చుకోవడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవలసి వచ్చింది. BJP తీసుకున్న అనాలోచిత చర్యగా ఈ నిర్ణయాన్ని ప్రతిపక్షాలు ఖండించాయి. తాజాగా ఇప్పుడు RBI మరోసారి ఇదే తరహా బాంబును పేల్చింది.
చెలామణిలో పెరిగిన నకిలీ కరెన్సీ కారణంగా రూ.2000 నోట్లను ఉపసంహరించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు RBI వర్గాలు తెలిపాయి. బ్లాక్ మనీ మార్కెట్ ను లక్ష్యంగా చేసుకుని ఆపరేషన్ క్లీన్ నోట్ పాలసీ దిశగా ముందడుగు వేస్తున్నట్లు పేర్కొన్నాయి. అయితే నోట్లను రద్దు చేసే అధికారం సెంట్రల్ బ్యాంకుకు లేదని వెల్లడించాయి.

రద్దు కాబడిన రూ.2000 నోట్లను సెప్టెంబరు 30 లోపు డిపాజిట్ చేయాలని ప్రజలను ప్రోత్సహిస్తున్నట్లు RBI తెలిపింది. అక్టోబర్ 1, 2023 నుంచి లీగల్ టెండర్ కొనసాగుతుందని, కానీ ప్రతి ఒక్కరూ ఇచ్చిన వ్యవధిలో మార్పిడి చేసుకోవాలని తన సర్క్యులర్ లో కోరింది. 2013-2014లో జరిగిన తరహాలోనే ఈసారి సైతం ప్రక్రియ కొనసాగుతుందని వెల్లడించింది.
2 వేల డినామినేషన్ నోట్లు జారీచేయడాన్ని నిలిపివేయడం తక్షణం అమలు చేయాలని దేశంలోని బ్యాంకులకు రిజర్వ్ బ్యాంకు ఆదేశించింది.
అదే విధంగా సెప్టెంబరు 30, 2023 వరకు ఆ నోట్లను డిపాజిట్ లేదా మార్పిడి చేసుకునే సౌలభ్యం ప్రజలకు కల్పించాలని సూచించింది. ఇప్పటికే 2 వేల నోట్ల ముద్రణను 2018-19 నుంచి నిలిపివేయడం గమనార్హం.


Click it and Unblock the Notifications