Indian Economy: మునుపటి ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థ పటిష్టమైన పనితీరును ప్రదర్శించిందని రిజర్వు బ్యాంక్ విడుదల చేసిన వార్షిక నివేదికలో వెల్లడించింది. ఈ క్రమంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థఇక వ్యవస్థల్లో ఒకటిగా అవతరించిందని పేర్కొంది. ద్వితియార్థంలో గ్రామీణ డిమాండ్ తగ్గటం, వినియోగం బలహీనపడటం కనిపించాయని నివేదించింది.
ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఒత్తిళ్లు కారణంగా వృద్ధి మందగించటం, కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు మార్కెట్లలో అస్థిరతలను పెంచాయి. వీటి మధ్య భారత ఆర్థిక వ్యవస్థ ప్రతికూల నష్టాలను ఎదుర్కొంటుందని ఆర్‌బిఐ తెలిపింది. ఈ అనిశ్చితి వాతావరణంలో భారతదేశంలో ప్రైవేట్ పెట్టుబడులు తగ్గుముఖం పట్టాయని RBI హైలైట్ చేసింది. అలాగే ద్రవ్యోల్బణం ఒత్తిళ్లు వినియోగదారుల నుంచి డిమాండ్ తగ్గించి వృద్ధి నెమ్మదించేలా చేయవచ్చని హెచ్చరించింది.

ప్యాసింజర్ కార్లలో రికవరీతో పోలిస్తే ధర-సెన్సిటివ్ ఎంట్రీ-లెవల్ కార్లలో వృద్ధి నెమ్మదిగా ఉండవచ్చని రిజర్వు బ్యాంక్ పేర్కొంది. దేశంలోని గ్రామీణ డిమాండ్ అణచివేయబడినందున ద్విచక్రవాహనాల అమ్మకాల్లో తగ్గింది. FY23లో వ్యవసాయ, వ్యవసాయేతర కార్మికుల వేతన వృద్ధి వరుసగా 5.8 శాతం, 4.9 శాతం తగ్గాయి. కరోనా సమయంలో గ్రామీణ డిమాండ్, పట్టణ ఆర్థిక వ్యవస్థతో పోలిస్తే నెమ్మదిగా ఉన్నప్పటికీ కోలుకుందని రిజర్వు బ్యాంక్ గుర్తించింది. అయితే ఆర్థిక కార్యకలాపాల్లో పెరుగుదల కనిపించినప్పటికీ.. వాస్తవ గ్రామీణ వేతన వృద్ధి నిలిచిపోయిందని పేర్కొంది.
అంతర్జాతీయ ప్రతికూలతల మధ్య భారత ఆర్థిక వ్యవస్థ మునుపటి ఆర్థిక సంవత్సరంలో వాస్తవ జీడీపీలో 7 శాతం వృద్ధిని నమోదు చేసిందని ఆర్‌బిఐ అంచనా వేసింది. గత ఐదేళ్లలో సగటున 12 శాతం ప్రపంచ వృద్ధికి భారత్ దోహదపడినట్లు రిజర్వు బ్యాంక్ వెల్లడించింది. ద్రవ్యోల్బణం తగ్గటం వల్ల ఆర్థిక వ్యవస్థ వృద్ధి పుంజుకుంటుందని ఆర్బీఐ అంచనా వేసింది.


Click it and Unblock the Notifications