RBI News: వినూత్న మార్పుకు ఆర్బీఐ శ్రీకారం.. OTP స్థానంలో కొత్త సాంకేతికతకు ప్రతిపాదన
Banking News: బ్యాంక్స్ సహా దేశ వ్యాప్తంగా ఉన్న ఆర్థిక సంస్థలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నియంత్రిస్తూ ఉంటుంది. సందర్భానుసారంగా కొత్త నిబంధనలతో పాటు నూతన సాంకేతికతను సైతం జోడిస్తూ, ప్రజాధనాన్ని సంరక్షిస్తుంది. తాజాగా వన్ టైం పాస్‌వర్డ్స్(OTP) గురించి కీలక నిర్ణయం తీసుకోనుంది.
సాంప్రదాయ SMS ఆధారిత టూ స్టెప్ వెరిఫికేషన్ వ్యవస్థను తొలగించాలంటూ రిజర్వ్ బ్యాంకు బ్యాంకులకు సూచించింది. దాని స్థానంలో సురక్షితమైన, అధునాతన ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని కోరింది. వివిధ ఆప్షన్స్ అందుబాటులో ఉన్నప్పటికీ, అన్నింటిలోనూ ప్రామాణీకరణ కోసం వినియోగదారుల మొబైల్ ఫోన్‌ని ఉపయోగించడం కామన్ ఉంటోందని మీడియా నివేదికలు చెబుతున్నాయి.

ప్రస్తుతం డిజిటల్ ఆర్థిక లావాదేవీని నిర్వహించినప్పుడు, ఫిన్‌టెక్ సంస్థ లేదా బ్యాంక్ వినియోగదారుడి ఖాతాకు లింక్ చేయబడిన మొబైల్ నంబర్‌కు OTPని పంపుతుంది. OTPని నమోదు చేసి అదనపు ప్రామాణీకరణ పూర్తయిన తర్వాత, బ్యాంక్ ఖాతాల భద్రతను నిర్ధారిస్తుంది. అప్పుడే కస్టమర్ డేటా అనధికార వినియోగాన్ని నిరోధించగలుగుతుంది. తర్వాత లావాదేవీ కొనసాగుతుంది.
అదనపు ప్రామాణీకరణ(AFA)ను పూర్తిగా తొలగించే ఉద్దేశాన్ని RBI సూచించలేదు. కానీ ఆ ప్రక్రియను క్రమబద్ధీకరించేందుకు ప్రయత్నిస్తోంది. 'ఆర్బీఐ ఎటువంటి AFAని నిర్దేశించనప్పటికీ, పేమెంట్ ఇండస్ట్రీలోని ప్లేయర్స్ ఎక్కువగా SMS ఆధారిత OTPని స్వీకరిస్తున్నారు. ఇటీవల కాలంలో సాంకేతికత పెరిగి, ప్రత్యామ్యాయ ఆవిష్కరణలు అందుబాటులోకి వచ్చాయి. డిజిటల్ భద్రత సహా మెకానిజమ్‌ని సులభతరం చేయడానికి ప్రత్యేక ఫ్రేమ్‌వర్క్‌ను అనుసరించాలి' అని ఆర్బీఐ ప్రతిపాదించింది.
రూట్ మొబైల్ తాజాగా ట్రూసెన్స్ అనే వినూత్న OTP అవసరంలేని ప్రమాణీకరణ వ్యవస్థను ప్రవేశపెట్టింది. ఈ పద్ధతిలో టోకెన్ మార్పిడిని సులభతరం చేయడానికి వినియోగదారుల పరికరాలతో ప్రత్యక్ష డేటా కనెక్షన్‌లను ఏర్పాటు చేసేలా సర్వీస్ ప్రొవైడర్లను అనుమతిస్తుంది. అయితే ప్రమాణీకరణ కోసం కేవలం బయోమెట్రిక్స్‌పై ఆధారపడకూడదని దాని ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ డేవిడ్ విగార్ హెచ్చరించారు. ఫేస్ రికగ్నిషన్ వంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో ఎదురయ్యే డీప్ ఫేక్ తరహా నష్టాలను కూడా గుర్తించుకోవాలని సూచించారు.


Click it and Unblock the Notifications