భారతదేశంలో రెండవ అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంక్ అయిన HDFC bank కు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) భారీ జరిమానా విధించింది. చట్టబద్ధమైన నిబంధనలను పాటించడంలో లోపాలు ఉన్నందున.. ముఖ్యంగా కేవైసీ (KYC) నిబంధనలను సరిగ్గా అమలు చేయనందున RBI ఈ చర్య తీసుకుంది. మరిన్ని వివరాల్లోకి వెళ్తే..

కారణాలివే..
రిజర్వ్ బ్యాంక్ విడుదల చేసిన నోట్ ప్రకారం.. HDFC bank కు రూ.91 లక్షల రూపాయల పెనాల్టీ విధించబడింది. ఈ జరిమానా విధించడానికి ప్రధానంగా మూడు అంశాలు కారణమయ్యాయి:
- బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టంలోని కొన్ని నిబంధనలను ఉల్లంఘించడం.
- అడ్వాన్స్‌లపై వడ్డీ రేటు, రిస్క్ గైడ్ లైన్స్ ను సరిగ్గా పాటించకపోవడం, అవుట్‌సోర్సింగ్‌లో కోడ్ ఆఫ్ కండక్ట్.. వంటి అంశాలపై RBI ఇచ్చిన ఆదేశాలను సరిగా పాటించకపోవడం.
- KYC (Know Your Customer) నిబంధనలను సరిగ్గా పాటించడంలో విఫలం కావడం.
తనిఖీలో బయటపడ్డ లోపాలు
మార్చి 31, 2024 నాటికి HDFC bank ఆర్థిక స్థితికి సంబంధించి సెంట్రల్ బ్యాంక్ పర్యవేక్షక మూల్యాంకనం కోసం ఒక చట్టబద్ధమైన తనిఖీని (Statutory Inspection) నిర్వహించింది. ఈ తనిఖీలో కింది లోపాలు స్పష్టంగా కనిపించాయి..
- KYC నియమాలు అవుట్‌సోర్సింగ్: ఈ బ్యాంక్ కొన్ని కస్టమర్ల KYC వెరిఫికేషన్ పనిని కొన్ని అవుట్‌సోర్సింగ్ ఏజెంట్లకు అప్పగించింది. ఇది RBI నిబంధనలకు విరుద్ధం.
- రుణాల వర్గీకరణలో లోపం: ఒకే రకమైన రుణాల HDFC bank బహుళ బెంచ్‌మార్క్‌లను (Multiple Benchmarks) అనుసరించింది.
- అనుమతి లేని వ్యాపారం: బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టంలోని సెక్షన్ 6$ కింద అనుమతించబడని కొన్ని వ్యాపారాలాను కూడా చేపట్టింది.
ఈ కారణాలు బయటపడడంతో HDFC బ్యాంకుకి RBI నోటీసు ఇచ్చింది. దీనికి HDFC bank ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేకపోవడంతో జరిమానా విధించబడింది.
గతంలో కూడా ఎదురైన సవాళ్లు
HDFC bank నియంత్రణపరమైన లోపాలను ఎదుర్కోవడం ఇది మొదటిసారి కాదు. 2020 లో, సరిగా లేని IT భద్రతా వ్యవస్థల కారణంగా గతంలో ఈ బ్యాంకుపై వేటు పడింది. కొత్త క్రెడిట్ కార్డ్ కస్టమర్లను చేర్చుకోకుండా HDFC bank పై RBI నిషేధం విధించింది. ఈ నిషేధం దాదాపు ఒక సంవత్సరం పాటు కొనసాగింది. నిషేధాన్ని ఎత్తివేయడానికి బ్యాంక్ తన IT వ్యవస్థలను మెరుగుపరచాల్సి వచ్చింది.
కస్టమర్లపై నో ఎఫెక్ట్
ప్రస్తుతం HDFC bank 25 మిలియన్లకు పైగా కస్టమర్లతో దేశంలోనే అతిపెద్ద క్రెడిట్ కార్డ్ ఇష్యూవర్ గా ఉంది. ఈ తాజా జరిమానా వల్ల బ్యాంక్ యొక్క గవర్నెన్స్, నియంత్రణల లోపాలు మరోసారి బయటపడ్డాయి. దీంతో మిగతా బ్యాంకులకు కూడా వీటి అవసరాన్ని గుర్తు చేసినట్టయింది.
చివరిగా RBI స్పష్టంగా చెప్పినదేంటంటే.. ఈ జరిమానా కేవలం చట్టబద్ధమైన నిబంధనలలోని లోపాల కారణంగా విధించబడింది. బ్యాంక్ తన కస్టమర్లతో కుదుర్చుకున్న ఏదైనా లావాదేవీ లేదా ఒప్పందం యొక్క చెల్లుబాటుపై ఈ పెనాల్టీ ఎటువంటి ప్రభావాన్ని చూపదు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!



Click it and Unblock the Notifications