RBI: M&M ఫైనాన్స్, ఇండియన్ బ్యాంక్, ముత్తూట్ మనీలపై పెనాల్టీ విధించిన RBI.. కారణమేంటంటే..
RBI: దేశంలోని బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు RBI నిబంధనలు పాటించడం తప్పనిసరి. ఒకవేళ వేటినైనా అతిక్రమిస్తే కేంద్ర బ్యాంకు జరిమానాలు వసూలు చేస్తూ ఉంటుంది. ఇవే కారణాలతో మహీంద్రా అండ్ మహీంద్రా ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇండియన్ బ్యాంక్, ముత్తూట్ మనీ లిమిటెడ్ పై రిజర్వు బ్యాంకు అపరాధ రుసుము విధించింది.
రుణగ్రహీతలకు వడ్డీ రేట్లను వెల్లడించడంలో నిబంధనలను పాటించనందుకు.. మహీంద్రా అండ్ మహీంద్రా ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ పై రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా కొరడా ఝళిపించింది. రూ.6.77 కోట్ల జరిమానా విధించింది. KYC నియమాలు పట్టించుకోనందుకు గాను ఇండియన్ బ్యాంకుకు 55 లక్షలు, మోసాల పర్యవేక్షణకు సంబంధించిన నిబంధనల్లో అలసత్వం వహించినందుకు ముత్తూట్ మీద 10.50 లక్షల మేర అపరాధ రుసుము వసూలు చేయనుంది.

రెగ్యులేటరీ నిబంధనల ఉల్లంఘన ఆధారంగా పెనాల్టీలు విధించినట్లు RBI పేర్కొంది. కస్టమర్లతో ఆయా సంస్థలు కుదుర్చుకున్న ఏవైనా ఒప్పందాలు, లావాదేవీల విషయంలో తాము జోక్యం చేసుకోలేదని వెల్లడించింది. తమ సాధారణ తనిఖీల్లో భాగంగా గుర్తించిన కారణాల రీత్యా జరిమానా వేసినట్లు చెప్పింది. ఈమేరకు RBI ఓ ప్రకటనలో తెలిపింది.
మార్చి 31, 2019 మరియు మార్చి 31, 2020లో మహీంద్రా & మహీంద్రా ఫైనాన్షియల్ సర్వీసెస్ ఆర్థిక స్థితిని తనిఖీ చేయడంలో భాగంగా అపరాధ రుసుము విధించామని RBI వివరించింది. జూలై 2020లో ఇండియన్ బ్యాంక్ నివేదించిన ఓ భారీ మోసంపై జరిపిన విచారణ ఆధారంగా దానిపై పెనాల్టీ వేసినట్లు చెప్పింది. 'NBFCల ఆదేశాలు, 2016లోని మోసాల పర్యవేక్షణ'లోని కొన్ని నిబంధనలను పాటించనందుకు ఎర్నాకులంలోని ముత్తూట్ మనీ లిమిటెడ్‌పై రూ.10.50 లక్షలు జరిమానా విధించామంది.


Click it and Unblock the Notifications