adani: దేశంలో ఉన్న వివిధ ఛారిటబుల్ ట్రస్టులతో పాటు పలు సంస్థలు, వ్యక్తులకు విదేశాల నుంచి విరాళాలు వస్తుంటాయి. వీటి ముసుగులో టెర్రర్ ఫండింగ్ సహా దేశాన్ని అస్థిర పరచేందుకు కుట్రలు జరుగుతున్నాయని ఎప్పటి నుంచో ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా RBI, కేంద్ర హోంశాఖ సైతం విరాళాలను డేగకన్నుతో పరిశీలిస్తోంది. ఈ పరిణామానికి అదానీ సంక్షోభమూ ఓ కారణమనే టాక్ మార్కెట్ వర్గాల్లో వినిపిస్తోంది. ఈ రెండింటికీ సంబంధం ఏమిటో చూద్దాం..

NEFT, RTGS వ్యవస్థల్లోకి FCRA:
UPI వ్యవస్థ అందుబాటులోకి రాకముందు మనం వేరే వారికి డబ్బు పంపించాలంటే NEFT, RTGS వ్యవస్థలను వినియోగించే వాళ్లం. ఇప్పడు వాటిని విదేశాల నుంచి భారత్ కు నగదు బదిలీ కోసం ఎక్కువగా వినియోగిస్తున్నారు. నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్‌ఫర్ (NEFT), రియల్ టైమ్ గ్రాస్ సెటిల్‌మెంట్ (RTGS) సిస్టమ్స్ ద్వారా దేశంలోకి వస్తున్న విదేశీ విరాళాల నియమాల్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కొన్ని మార్పులు చేసింది. ఈ విధానాల్లోకి ఫారిన్ కంట్రిబ్యూషన్ (రెగ్యులేషన్) యాక్ట్ (FCRA) కోడ్‌ను ప్రవేశపెట్టింది. కేంద్ర హోంశాఖ అవసరాల దృష్ట్యా వీటిని అమల్లోకి తీసుకువచ్చినట్లు పేర్కొంది.

విరాళాలన్నీ ఆ ఖాతాలోకే:
సాధారణంగా వివిధ దేశాల మధ్య జరిగే లావాదేవీల కోసం 'సొసైటీ ఫర్ వరల్డ్‌వైడ్ ఇంటర్ బ్యాంక్ ఫైనాన్షియల్ టెలికమ్యూనికేషన్ (SWIFT)' పద్ధతి వినియోగిస్తుంటారు. కాబట్టి విదేశీ బ్యాంకుల నుంచి SWIFT, NEFT, RTGS సిస్టమ్స్ ఉపయోగించి భారతీయ మధ్యవర్తి బ్యాంకుల ద్వారా పంపించే విరాళాల విషయంలో RBI మరింత పారదర్శకతను కోరింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)కి చెందిన న్యూ ఢిల్లీ మెయిన్ బ్రాంచ్ (NDMB) FCRA ఖాతాలో మాత్రమే వాటిని జమచేయాలని ఆదేశించింది.

రోజూ వివరాలు ఇవ్వాల్సిందే..
విరాళం ఇస్తున్న దాతల పేరు, చిరునామా, పుట్టిన దేశం, మొత్తం విలువ, కరెన్సీ, రెమిటెన్స్ ఉద్దేశం వంటి వివరాలను పంచుకోవాలని RBIని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MHA) కోరింది. విరాళాల లావాదేవీల నుంచి ఈ వివరాలను సమర్పించాలని ఆయా బ్యాంకులకు రిజర్వు బ్యాంక్ తెలిపింది. వాటిని MHAకి ప్రతిరోజూ రిపోర్ట్ చేయాలని SBIని ఆదేశించింది. NEFT, RTGS విధానాలను అనుసరిస్తున్న బ్యాంకులు ఈ మేరకు తమ సాఫ్ట్ వేర్, కోర్ బ్యాంకింగ్ వ్యవస్థలో మార్పులు చేయాలని సూచించింది.

అదానీకి, విరాళాలకు సంబంధం ఏంటి?
అదానీ గ్రూపు సంక్షోభం వల్ల విదేశీ పెట్టుబడిదారులు సైతం తీవ్ర నష్టాలను ఎదుర్కోవాల్సి వచ్చిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై విచారణ జరిపించాలని పార్లమెంటులోనూ, దేశ వ్యాప్తంగా నిరసనలు జరుగుతున్నా కేంద్రం పెద్దగా పట్టించుకోవడం లేదు. ఇదే సమయంలో మన ప్రధాని తమకు సమాధానం చెప్పాలంటూ అమెరికాకు చెందిన బిలియనీర్ సోరోస్ డిమాండ్ చేశారు. అంతటితో ఆగకుండా ప్రజాస్వామ్య బద్ధంగా పాలన జరపడంలో మోడీ విఫలమయ్యారని, తాను తలచుకుంటే ప్రభుత్వాన్ని మార్చగలను అని సైతం వ్యాఖ్యలు చేసినట్లు మార్కెట్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ఈ మార్పుల అవసరమేంటి?
ఇప్పటికే వివిధ దేశాల ఆర్థిక వ్యవస్థలను నాశనం చేసిన అపప్రద సోరోస్ మీద ఉంది. ప్రజాస్వామ్యాన్ని విచ్ఛిన్నం చేయడానికి బయటి శక్తులు ప్రయత్నిస్తున్నాయని, భారతీయులు కలిసి కట్టుగా వాటిని ఎదుర్కోవాలని కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ ఇటీవల పేర్కొన్నారు. విదేశాంగ మంత్రి జయశంకర్ సైతం సోరోస్ చాలా ప్రమాదకరమైన వ్యక్తి అని వ్యాఖ్యానించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వీటన్నిటినీ కలిపి చూస్తే, కేంద్రంలోని మోడీ సర్కారును అస్థిర పరచేందుకు సోరోస్ ప్రయత్నించవచ్చని.. అందుకే ఈ తరహా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications