RBI Audit: దేశంలోని బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ వ్యాపారాన్ని సెంట్రల్ బ్యాండ్ ఆర్బీఐ పర్యవేక్షిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవల దేశంలో పేటీఎం, ఐఐఎఫ్ఎల్ పై కఠిన ఆంక్షల తర్వాత మరిన్ని చర్యలకు రిజర్వు బ్యాంక్ ముందుకొచ్చింది. నిబంధనల ఉల్లంఘనను ఏమాత్రం క్షమించటం లేదు.
ఇటీవల ఆర్బీఐ ఆగ్రహానికి గురైన కంపెనీల జాబితాలో ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్, జేఎమ్ ఫైనాన్షియల్ ప్రోడక్ట్స్ లిమిటెడ్ కంపెనీలు ఉన్నాయి. వాస్తవానికి నియంత్రణ ఉల్లంఘనలను పరిశోధించడానికి సెంట్రల్ రిజర్వ్ బ్యాంక్ IIFL ఫైనాన్స్ లిమిటెడ్, JM ఫైనాన్షియల్ ప్రోడక్ట్స్ లిమిటెడ్(JMFPL) కంపెనీల కార్యక్రమాలపై ప్రత్యేక ఆడిట్‌ను ప్రారంభిస్తోంది. ఏప్రిల్ 12 నుంచి ఈ ప్రత్యేక ఆడిట్ జరగనుంది. ఈ క్రమంలో రిజర్వు బ్యాంక్ ఇప్పటికే ఐఐఎఫ్‌ఎల్ ఫైనాన్స్ గోల్డ్ లోన్స్ ఇవ్వకుండా నిరోధించింది. ఇదే క్రమంలో JMFPL షేర్లు లేదా డిబెంచర్ల ఫైనాన్సింగ్‌పై పరిమితులను ఎదుర్కొంటోంది.

ఈ రెండు కంపెనీలపై ఆంక్షలు ఒకపక్క కొనసాగుతుండగా.. ప్రత్యేక ఆడిట్ పూర్తి చేసి లోపాలను సరిదిద్దిన తర్వాతే పరిమితులను సమీక్షిస్తామని ఆర్‌బీఐ తేల్చి చెప్పింది. ఈ రెండు కంపెనీలపై ప్రత్యేక ఆడిట్ చేసేందుకు ఆర్‌బీఐ ఈ-టెండర్‌ను జారీ చేసింది. ప్రత్యేక ఆడిట్‌పై ఆసక్తి ఉన్న ఆడిట్ సంస్థలు దరఖాస్తు చేసుకోవచ్చని రిజర్వు బ్యాంక్ ప్రకటించింది. ముఖ్యంగా సెబీ ఆడిట్ సంస్థలు ఫోరెన్సిక్ ఆడిట్ కోసం టెండర్ ప్రక్రియలో పాల్గొనవచ్చు. ఆడిట్ కోసం ఎంపిక చేయబడిన సంస్థలకు ఏప్రిల్ 12, 2024న పని అప్పగించబడుతుందని సమాచారం.
మార్చి 4, 2024న సెంట్రల్ రిజర్వ్ బ్యాంక్ కస్టమర్ల ప్రయోజనాలను కాపాడేందుకు IIFL ఫైనాన్స్ కొత్త బంగారు రుణాలను పంపిణీ చేయకుండా నిలిపివేసింది. డిసెంబర్ 31, 2023 నాటికి IIFL ఫైనాన్స్ గ్రూప్ నిర్వహణలో ఉన్న మొత్తం అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ గోల్డ్ లోన్‌లు 32 శాతం విలువ అక్షరాలా రూ. 24,692 కోట్లు. దాదాపు 15,000 మంది ఉద్యోగులతో 25 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో గోల్డ్ లోన్ శాఖలను కంపెనీ నిర్వహిస్తోంది.
ఇక JM ఫైనాన్షియల్ ప్రోడక్ట్స్ విషయానికొస్తే.. మార్చి 5, 2024న ఐపీవోలకు వ్యతిరేకంగా రుణాలను మంజూరు చేయడం, పంపిణీ చేయడంతో సహా షేర్లు, డిబెంచర్‌లపై ఎలాంటి ఫైనాన్స్‌ను అందించకుండా రిజర్వు బ్యాంక్ నిషేధించింది. రిజర్వు బ్యాంక్ పరిణామాలతో కంపెనీల షేర్లు స్టాక్ మార్కెట్లలో కుప్పకూలాయి. అయితే పరిస్థితులు ఎప్పటికి స్థిమితపడతాయో తెలియక పెట్టుబడిదారులు ఆందోళన చెందుతున్నారు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!



Click it and Unblock the Notifications