RBI News: బ్యాంకింగ్ వ్యవస్థపై భారీగా ఫిర్యాదులు.. RBI అంబుడ్స్‌మన్ డేటాలో కీలక విషయాలు
RBI Ombudsmen: సాధారణ ప్రజలు ఆయా సేవలు వినియోగించుకోవడం కోసం బ్యాంకుల చుట్టూ తిరిగి అలసిపోతుంటారు. ఇటీవల కొన్ని పైసలు బకాయి కలిగి ఉన్నాడంటూ భారతీయ స్టేట్ బ్యాంక్ ఓ రైతును ఏళ్ల తరబడి తిప్పించుకున్న ఘటన విని న్యాయస్థానం మొట్టికాయలు చేసింది. రుణం చెల్లించిన తర్వాత కూడా NOC ఇవ్వకుండా ఇబ్బంది పెట్టడంపై చివాట్లు పెట్టింది. ఈ తరహా ఇబ్బందులను ఎదుర్కొనేందుకు సామాన్యుడికి RBI ఇచ్చిన అస్త్రమే అంబుడ్స్‌మన్.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ అంబుడ్స్‌మన్ స్కీం కింద ఫిర్యాదులు 68.2 శాతం పెరిగినట్లు RBI తెలిపింది. మొత్తం కంప్లైంట్స్ సంఖ్య 7 లక్షల 3 వేలకు చేరుకున్నట్లు తన నివేదికలో పేర్కొంది. FY21లో 15.7 శాతం, FY22లో 9.4 చొప్పున ఫిర్యాదులు నమోదైనట్లు వెల్లడించింది. ప్రజా చైతన్య కార్యక్రమాలు, సరళీకృత ప్రక్రియ వల్ల ఈ భారీ పెరుగుదల నమోదు అయినట్లు స్పష్టం చేసింది.

FY23లో నమోదైన 2 లక్షల 34 వేల ఫిర్యాదులను అంబుడ్స్‌మన్ కార్యాలయం డైరెక్ట్ గా నిర్వహించింది. ఇక 4 లక్షల 68 వేలను కేంద్రీకృత రసీదు మరియు ప్రాసెసింగ్ సెంటర్(CRPC) పరిష్కరించింది. CRPC ఫిజికల్ మోడ్లో అప్లికేషన్లను స్వీకరిస్తుంది. వాటిని క్షుణ్ణంగా పరిశీలించి, ప్రాసెస్ చేసి CMSలోకి అప్లోడ్ చేస్తుంది. అనంతరం అవి అంబుడ్స్‌మన్ కార్యాలయాలకు అటాచ్ చేయబడతాయి.
ఏదేమైనాప్పటికీ RBI ప్రయత్నాలు ఫలించి ప్రజల్లో చైతన్యం పెరిగినట్లు ఈ డేటాను బట్టి అర్థమవుతుంది. కేవలం బ్యాంకింగ్ రంగమే కాక సెంట్రల్ బ్యాంక్ నియంత్రణలోని ఆర్థిక సంస్థలపై కూడా ఈ విధానం ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. అయితే ఇక్కడ కంప్లైంట్ చేసే ముందు వినియోగదారులు RBI సహా బ్యాంకింగ్ నిబంధనలు పాటించే విధంగా జాగ్రత్త వహించాల్సి ఉంటుంది.


Click it and Unblock the Notifications