మనలో చాలా మంది కష్టపడి సంపాదించిన డబ్బును బ్యాంకుల్లో దాచుకుంటారు. ఎందుకంటే అక్కడ డబ్బు భద్రంగా ఉంటుందని మన నమ్మకం. అయితే బ్యాంకుల్లో మనం దాచుకున్న ప్రతి రూపాయికి రక్షణ ఉంటుందని మీకు తెలుసా? దీనికోసమే 'డిపాజిట్ ఇన్సూరెన్స్' (Deposit Insurance) అనే వ్యవస్థ ఉంది. తాజాగా RBI (రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) ఈ ఇన్సూరెన్స్ ప్రీమియం విషయంలో ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. దాదాపు 60 ఏళ్లుగా కొనసాగుతున్న పాత పద్ధతికి ఏప్రిల్ 1 నుంచి స్వస్తి పలుకుతోంది.

ఏప్రిల్ 1 నుంచి మారనున్న పద్ధతి
ఇప్పటివరకు మన దేశంలో అన్ని బ్యాంకులు తమ వద్ద ఉన్న ప్రతి 100 రూపాయల డిపాజిట్‌పై 12 పైసల ఇన్సూరెన్స్ ప్రీమియంను DICGC (డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్)కు చెల్లిస్తున్నాయి. బ్యాంకు బాగున్నా, రిస్క్‌లో ఉన్నా అందరికీ ఒకే రేటు ఉండేది. కానీ, ఏప్రిల్ 1 నుంచి ఈ 'ఫ్లాట్-రేట్' పద్ధతి పోయి, 'రిస్క్-బేస్డ్ ప్రీమియం' (Risk-based Premium) మోడల్ అమల్లోకి రానుంది. అంటే ఏ బ్యాంకు ఎంత పటిష్టంగా ఉంటే, ఆ బ్యాంకు అంత తక్కువ ప్రీమియం చెల్లించేలా RBI వెసులుబాటు కల్పించింది.
బ్యాంకులను 4 కేటగిరీలుగా వర్గీకరణ
కొత్త నిబంధనల ప్రకారం.. RBI బ్యాంకులను వాటి ఆర్థిక పరిస్థితిని బట్టి A, B, C, D అనే నాలుగు గ్రూపులుగా విడదీస్తుంది.
- కేటగిరీ A: అత్యంత సురక్షితమైన బ్యాంకులు. ఇవి 100 రూపాయలకు కేవలం 8 పైసలే ప్రీమియం చెల్లిస్తే సరిపోతుంది. అంటే వీటికి దాదాపు 33% డిస్కౌంట్ లభిస్తుంది.
- కేటగిరీ B & C: ఇవి వరుసగా 10 పైసలు , 11 పైసలు చెల్లించాల్సి ఉంటుంది.
- కేటగిరీ D: ఆర్థికంగా కాస్త బలహీనంగా ఉన్న బ్యాంకులు పాత రేటు ప్రకారం 12 పైసలే చెల్లించాలి.
దీనివల్ల బ్యాంకులు తమ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నిస్తాయి. ఫలితంగా కస్టమర్ల సొమ్ము మరింత భద్రంగా ఉంటుంది.
వింటేజ్ ఇన్సెన్టివ్: పాత బ్యాంకులకు బంపర్ ఆఫర్!
కేవలం రిస్క్ తక్కువగా ఉండటమే కాదు, ఏవైనా బ్యాంకులు ఎన్నో ఏళ్లుగా నమ్మకమైన సేవలు అందిస్తూ ఎలాంటి సమస్యల్లో ఇరుక్కోకుండా ఉంటే వారికి అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. దీనిని 'వింటేజ్ ఇన్సెన్టివ్' (Vintage Incentive) అని పిలుస్తారు. ప్రతి ఏడాదికి 1% చొప్పున గరిష్టంగా 25% వరకు ఈ డిస్కౌంట్ పొందే అవకాశం ఉంది. అంటే 25 ఏళ్లుగా సక్రమంగా నడుస్తున్న బ్యాంకులకు ప్రీమియంలో భారీ ఊరట లభిస్తుంది.
డిపాజిటర్లకు ఏమైనా మార్పు ఉంటుందా?
సాధారణ కస్టమర్లుగా మనకు ఇన్సూరెన్స్ కవరేజీలో ఎలాంటి మార్పు ఉండదు. బ్యాంకు ఒకవేళ దివాలా తీసినా మనకు అందే రూ. 5 లక్షల గ్యారెంటీ కవర్ అలాగే ఉంటుంది. అయితే, బ్యాంకులు తమ రిస్క్ రేటింగ్‌ను రహస్యంగా ఉంచాలి. ఆ రేటింగ్‌ను చూపిస్తూ కస్టమర్లను ఆకర్షించకూడదని RBI కఠినమైన నిబంధన పెట్టింది.
మొత్తానికి, ఏప్రిల్ నుంచి రాబోతున్న ఈ మార్పుల వల్ల బ్యాంకింగ్ వ్యవస్థలో జవాబుదారీతనం పెరుగుతుంది. బ్యాంకులు తమ మేనేజ్‌మెంట్‌ను మెరుగుపరుచుకోవడమే కాకుండా కస్టమర్ల విశ్వాసాన్ని నిలబెట్టుకోవడానికి మరింత కష్టపడతాయి. ఇది నిజంగా సామాన్య డిపాజిటర్లకు శుభవార్తే!
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications