Home Loan: లోన్ మధ్యలో కూడా వడ్డీ రేటును తగ్గించుకోవచ్చని తెలుసా? ఇలా చేస్తే చాలు!
రీసెంట్ గా RBI కొన్ని కొత్త క్రెడిట్ స్కోర్ రూల్స్ గురించి ప్రకటించింది. అయితే వీటి ద్వారా మీ లోన్ వడ్డీ రేటు తగ్గే అవకాశం ఉంటుదని మీకు తెలుసా? RBI (రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) తీసుకువచ్చిన కొత్త ఆదేశాల ప్రకారం.. మీరు లోన్ తీసుకున్న తర్వాత కూడా మీ క్రెడిట్ స్కోర్ మెరుగుపడితే.. వడ్డీ రేటును తగ్గించాలని మీరు బ్యాంకును కోరవచ్చు. దీని గురించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

ఒకవేళ మీరు ఫ్లోటింగ్ వడ్డీ రేటుతో (Floating Interest Rate) హోమ్ లోన్ (Home Loan) తీసుకున్నప్పుడు.. బ్యాంకులు ఇతర అంశాలతో పాటు మీ క్రెడిట్ స్కోర్ (Credit Score) ఆధారంగా వడ్డీ రేటును నిర్ణయిస్తాయి. క్రెడిట్ స్కోర్ ఎంత ఎక్కువగా ఉంటే.. వడ్డీ రేటు అంత తక్కువగా ఉంటుంది. అయితే మీ వడ్డీ రేటును తగ్గించుకోవడానికి మీరు ఏం చేయొచ్చంటే..
RBI కొత్త రూల్స్ ఇవే..
రీసెంట్ గా RBI కొన్ని వడ్డీ రేట్లను సవరించిది. ఈ కొత్త కొత్త ఆదేశాల ప్రకారం.. కస్టమర్లను నిలుపుకోవడం కోసం బ్యాంకులు ఇంతకు ముందు ఉన్న మూడేళ్ల కాలపరిమితి కంటే ముందుగానే లోన్ స్ప్రెడ్ (Spread) ను తగ్గించవచ్చు. ముఖ్యంగా మీ క్రెడిట్ స్కోర్ ఇటీవల మెరుగుపడినట్లయితే లేదా మీ అప్పుల భారం తగ్గినట్లయితే మీరు తక్కువ రిస్క్ ఉన్న కస్టమర్‌గా మారినట్టు లెక్క. అప్పుడు మీరు వడ్డీ రేటు తగ్గింపు కోసం బ్యాంకును సంప్రదించవచ్చు.
హోమ్ లోన్స్ లో ఇలా..
హోమ్ లోన్ (Home Loan) వడ్డీ రేటు రెండు ప్రధాన భాగాలను కలిగి ఉంటుంది:
- బెంచ్‌మార్క్ రేటు (Benchmark Rate): ఇది RBI రెపో రేటు లేదా ఇతర మార్కెట్ రేటుపై ఆధారపడి ఉంటుంది.
- బ్యాంక్ స్ప్రెడ్ (Bank Spread): ఇది బ్యాంక్ మార్జిన్, ఆపరేషనల్ ఖర్చులు, మీ క్రెడిట్ రిస్క్ (క్రెడిట్ స్కోర్ ద్వారా అంచనా వేయబడుతుంది) వంటి అంశాలను కలిగి ఉంటుంది.
మీరు మీ మెరుగైన క్రెడిట్ స్కోర్‌తో బ్యాంకును సంప్రదించినప్పుడు, బ్యాంక్ మీ క్రెడిట్ అసెస్‌మెంట్ (Credit Assessment) నిర్వహిస్తుంది. మీ ప్రొఫైల్‌లో గణనీయమైన మెరుగుదల ఉందని నిర్ధారించబడితే.. బ్యాంక్ మీ లోన్‌పై వసూలు చేసే క్రెడిట్ రిస్క్ ప్రీమియంను తగ్గిస్తుంది. ఫలితంగా, మొత్తం Home Loan వడ్డీ రేటు తగ్గుతుంది.
లాక్ ఇన్ పీరియడ్ లేదు
గతంలో లోన్ తీసుకున్న తర్వాత క్రెడిట్ స్కోర్ మెరుగుపడినా వడ్డీ రేటు తగ్గింపు కోసం క్రెడిట్ అసెస్‌మెంట్ చేయించుకోవడానికి మూడేళ్ల లాక్-ఇన్ పీరియడ్ ముగిసే వరకు వేచి ఉండాల్సి వచ్చేది. ఇప్పుడు RBI క్రెడిట్ అసెస్‌మెంట్ కోసం ఉన్న 3 ఏళ్ల లాక్-ఇన్ పీరియడ్‌ను తొలగించింది.
దీని అర్థం.. మీ క్రెడిట్ స్కోర్ మెరుగైతే మీరు వెంటనే బ్యాంకును సంప్రదించి, వడ్డీ రేటు తగ్గింపు కోసం అభ్యర్థించవచ్చు. వడ్డీ రేటు తగ్గితే మీ EMI మొత్తం తగ్గుతుంది లేదా మీ లోన్ కాలపరిమితి (Loan Tenure) తగ్గుతుంది, తద్వారా మీరు వేగంగా రుణ విముక్తులు కావచ్చు.


Click it and Unblock the Notifications