రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) దేశంలోని అన్ని బ్యాంకులకు ఒక ముఖ్యమైన ఆర్డర్ జారీ చేసింది, దింతో ఇప్పుడు 10 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న పిల్లలు సొంతంగా సేవింగ్స్ అకౌంట్ అండ్ ఫిక్స్డ్ డిపాజిట్‌ను ఓపెన్ చేయవచ్చు అలాగే అతను/ఆమె తల్లిదండ్రులు లేదా సంరక్షకుడి (guardian) సహాయం లేకుండానే అకౌంట్ స్వయంగా మెయింటేన్ చేయవచ్చు. ఇంతకుముందు పిల్లలకి ఇలాంటి అకౌంట్ తెరవడానికి తల్లిదండ్రులు లేదా చట్టపరమైన సంరక్షకుడు అవసరం, కానీ ఇప్పుడు 10 సంవత్సరాల వయస్సు తర్వాత సొంతంగా బ్యాంకుల్లో అకౌంట్ ఇంకా ఎఫ్దిలు తీసుకోవచ్చు.

దీనికి సంబంధించి సోమవారం అన్ని వాణిజ్య బ్యాంకులు అలాగే సహకార బ్యాంకులకు ఒక సర్క్యులర్ జారీ చేయడం ద్వారా ఆర్‌బిఐ ఈ సమాచారాన్ని అందించింది. ఏ వయసు వారైనా తల్లిదండ్రులు లేదా సంరక్షకుల ద్వారా అకౌంట్ తెరవవచ్చని, కానీ 10 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉంటే వాళ్లే స్వయంగా అకౌంట్ ఓపెన్ చేయవచ్చని అందులో పేర్కొంది. అంతేకాదు అతను/ఆమె తల్లిని సంరక్షకురాలిగా చేయడం ద్వారా కూడా అకౌంట్ తెరవవచ్చు.
కొత్త రూల్ హైలెట్స్ ఇవే:
*పిల్లల వయస్సు 10 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ ఉంటే అతను/ఆమె సొంతంగా సేవింగ్స్ ఇంకా టర్మ్ డిపాజిట్ అకౌంట్ ఓపెన్ చేయవచ్చు, నిర్వహించవచ్చు.
*అలాగే పిల్లలు ఎంత డబ్బు జమ చేయాలో, ఎంత వరకు విత్ డ్రా చేసుకోవచ్చో బ్యాంకులు నిర్ణయిస్తాయి. ఇదంతా బ్యాంకు రిస్క్ మేనేజ్‌మెంట్ విధానంపై ఆధారపడి ఉంటుంది.
*ఈ మైనర్లకు 18 సంవత్సరాలు నిండిన తరువాత బ్యాంకు మళ్ళీ అతను/ఆమె నుండి కొత్తగా సంతకం అండ్ అకౌంట్ మెయింటెనెన్స్ పద్ధతిని తీసుకుంటుంది.
*పిల్లలకు ఇంటర్నెట్ బ్యాంకింగ్, ATM/డెబిట్ కార్డ్, చెక్ బుక్ వంటి సౌకర్యాలు ఇవ్వాలా వద్దా అనేది బ్యాంకులు సొంతంగా నిర్ణయించుకోవచ్చు.
ఇతర ముఖ్యమైన విషయాలు: ఇటువంటి అకౌంట్ నుండి ఎక్కువగా డబ్బు విత్ డ్రా చేసుకోకూడదు అలాగే ఎల్లప్పుడూ కొంత బ్యాలెన్స్ మెయింటెనెన్స్ చేస్తుండాలి. ఇంకా కస్టమర్ KYC (know your customer) అంటే గుర్తింపు సరిగ్గా ఉందో లేదో చెక్ చేయబడుతుంది ఇంకా ఎప్పటికప్పుడు అప్ డేట్ చేయబడుతుంది.1 జూలై 2025 నాటికి ఈ కొత్త నిబంధనల ప్రకారం పాలసీలను సిద్ధం చేసుకోవాలని లేదా ఉన్న నిబంధనలను మార్చాలని RBI అన్ని బ్యాంకులను కోరింది.
ఓవర్‌డ్రాఫ్ట్ ఫెసిలిటీ : అయితే పిల్లల అకౌంట్లో ఓవర్‌డ్రాఫ్ట్ ఎప్పటికీ అనుమతించకూడదని ఆర్‌బిఐ స్పష్టం చేసింది; అంటే అకౌంట్లో ఎల్లప్పుడూ బ్యాలెన్స్‌లో ఉండాలి, లోన్ తీసుకునే సౌకర్యం కూడా ఉండదు.
More From GoodReturns

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..



Click it and Unblock the Notifications