దేశంలో సాధారణ ప్రజల ఆర్థిక భద్రతను కాపాడటం అలాగే ఆ దేశ ఆర్థిక వ్యవస్థను పర్యవేక్షించడం వంటిది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ప్రధాన బాధ్యతగా ఉంటుంది. అందుకే నిబంధనలు పాటించని సంస్థల పట్ల RBI కఠినంగా వ్యవహరిస్తుంటుంది. అందులో భాగంగానే రీసెంట్ గా నాలుగు నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీల (NBFC) పై కఠిన చర్యలు తీసుకుంటుంది. పశ్చిమ బెంగాల్, చండీగఢ్‌లకు చెందిన నాలుగు NBFCల రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్‌లను RBI ఇటీవల రద్దు చేసింది. RBI NBFC Cancellation చట్టం, 1934 లోని సెక్షన్ 45-IA (6) కింద RBI కి ఉన్న అధికారాలను ఉపయోగించి ఈ చర్య తీసుకుంది.

రద్దు చేయబడిన NBFCలు ఇవే..
రీసెంట్ గా RBI.. వెస్ట్ బెంగాల్ కు చెందిన జెమ్ ఇన్వెస్ట్‌మెంట్స్ & ట్రేడింగ్ కో ప్రైవేట్ లిమిటెడ్, విస్తార్ ఫైనాన్సియర్స్, అంబికా బార్టర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీల లైసెన్స్ ను రద్దు చేసింది. అలాగే చండీగఢ్‌కు చెందిన శ్రీ లఖావి ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ లైసెన్స్ ని కూడా రద్దు చేసింది.
కారణం ఇదే..
రిజర్వ్ బ్యాంక్ నిర్దేశించిన కనీస ప్రమాణాలను, మార్గదర్శకాలను పాటించకపోతే, RBI ఇలాంటి కఠినమైన నిర్ణయాలు తీసుకుంటుంది. ఈ చర్య ప్రజల విశ్వాసాన్ని కాపాడటానికి అలాగే ఆర్థిక వ్యవస్థలో పారదర్శకతను నిర్ధారించడానికి చాలా అవసరం. ఈ నాలుగు సంస్థలు సరైన ప్రమాణాలు పాటించకపోవడం వల్లనే RBI ఆయా లైసెన్స్ ను రద్దు చేసింది.
స్వచ్ఛందంగా సరెండర్ అయిన ఇతర సంస్థలు
రిజిస్ట్రేషన్ రద్దుతో పాటు మరో నాలుగు NBFCలు వివిధ కారణాల వల్ల స్వచ్ఛందంగా తమ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్‌లను RBI కి సరెండర్ చేశాయి. తమ పేరెంట్ కంపెనీ రద్దు అవ్వడంతో ఇంటెల్ ఇన్వోఫిన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, గంగోత్రి కమోడిటీస్ & ఫిన్‌వెస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ & పెర్కిన్ డీలర్స్ ప్రైవేట్ లిమిటెడ్ వంటి సంస్థలు స్వచ్ఛంగా లైసెన్స్ ను సరెండర్ చేశాయి.
బ్యాంక్‌పై జరిమానా
NBFC లపై చర్యలతో పాటు RBI ఒడిశాలోని పర్లఖేముండిలో ఉన్న ది కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ పై రూ. 13,000 జరిమానా విధించింది. ఈ చర్యకు కూడా RBI ఆదేశాలను పాటించకపోవడమే కారణం. RBI యొక్క ముందస్తు అనుమతి లేకుండా మూలధన వ్యయాన్ని (Capital Expenditure) ఖర్చు చేసింది. అలాగే ఆ బ్యాంక్ తన కస్టమర్ల క్రెడిట్ సమాచారాన్ని (Credit Information) నిర్దేశించిన నాలుగు క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీల (CIC) కు అందించడంలో విఫలమైంది.
సాధారణ ప్రజలకు రుణాలు ఇచ్చే సంస్థలు నిబంధనలను కచ్చితంగా పాటించేలా చూడటంలో RBI పాత్ర చాలా కీలకం. గతంలో కూడా హెచ్‌డీఎఫ్‌సీ(HDFC) బ్యాంక్ నియమాలు ఉల్లంఘించిన కారణంగా భారీగా ఫైన్ వేసింది. దేశ ఆర్థిక భద్రతకు RBI విధివిధానాలు ఎంత కీలకమో.. ఈ లైసెన్స్ రద్దులు, జరిమానా చర్యలు తెలియజేస్తున్నాయి.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!



Click it and Unblock the Notifications