రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మానిటరీ పాలసీ కమిటీ జూన్ 6వ తేదీ నుండి 8వ తేదీ వరకు సమావేశమైంది. ఈ భేటీలోని కీలక నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ ఈ రోజు (జూన్ 8, 2022) మీడియాకు వివరించారు. ఈ సందర్భంగా రెపో రేటును మరో 50 బేసిస్ పాయింట్లు పెంచారు. తద్వారా 4.90 శాతానికి పెరిగింది. గత ఐదు వారాల్లో ఆర్బీఐ రెపో రేటును పెంచడం రెండోసారి.
సాధారణంగా ఆర్బీఐ 2 నెలలకు ఓసారి పరపతి సమావేశం జరిపి, కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. అయితే గత నెలలో ద్రవ్యోల్భణాన్ని అదుపు చేసేందుకు అత్యవసరంగా సమావేశమై, రెపో రేటును 40 బేసిస్ పాయింట్లు తగ్గించింది. ఈసారి ఎంపీసీ సమావేశం సందర్భంగా మరో 50 బేసిస్ పాయింట్లు తగ్గింది.

దీంతో 4 శాతంగా ఉన్న వడ్డీ రేటు క్రితంసారి పెంపుతో 4.40 శాతానికి, తాజాగా 50 బేసిస్ పాయింట్ల పెంపుతో 4.90 శాతానికి చేరుకుంది. మొత్తంగా ఈ రెండుసార్లు 90 బేసిస్ పాయింట్లు పెరిగింది. తాజా పెంపుతో రుణగ్రహీతలపై మరింత ఈఎంఐ భారం పడుతుంది. ఆర్బీఐ రెపో రేటు పెంచడంతో బ్యాంకులు రెపో ఆధారిత వడ్డీ రేట్లను పెంచవచ్చు.
స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ అండ్ మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేటును కూడా 50 బేసిస్ పాయింట్లు పెంచింది ఆర్బీఐ. దీంతో స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ రేటు 4.65 శాతానికి, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేటు 5.15 శాతానికి చేరుకుంది. కాగా, ద్రవ్యోల్భణాన్ని అదుపు చేయడానికి కీలక రెపోరేటును ఆర్బీఐ మరోసారి మరోపావు శాతం నుండి అరశాతం వరకు పెంచవచ్చునని ఆర్థిక నిపుణులు భావించారు.


Click it and Unblock the Notifications