రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మానిటరీ పాలసీ కమిటీ నేడు రేపో రేటును 25 బేసిస్ పాయింట్లు అంటే 0.25 శాతం తగ్గిస్తూ ప్రకటించింది. అయితే ఈ MPC సమావేశం ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా అధ్యక్షతన ఏప్రిల్ 7 నుండి ఏప్రిల్ 9 వరకు జరిగింది. ప్రపంచ, దేశీయ వృద్ధి మందగించడం అలాగే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశంపై 26% ప్రతీకార సుంకాలను ప్రకటించిన కొద్ది రోజులకే ఆర్బీఐ నుండి ఈ ప్రకటన వచ్చింది. మరోవైపు RBI రెపో రేటును తగ్గింపుతో లోన్ EMI భారం కూడా తగ్గనుంది. రిజర్వ్ బ్యాంకు ప్రతి రెండు నెలలకు ఒకసారి ద్రవ్య కమిటీ సమావేశాన్ని నిర్వహిస్తుంది.

5 సంవత్సరాల తర్వాత ఫిబ్రవరిలో కోత: గత నెల ఫిబ్రవరిలో జరిగిన MPC సమావేశంలో రిజర్వ్ బ్యాంక్ ఒక పెద్ద నిర్ణయం తీసుకుని, ఐదు సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత రెపో రేటు (RBI repo rate cut)ను 25 బేసిస్ పాయింట్లు కోత విధించింది. దింతో ఆ సమయంలో రేపో రేట్ 6.25 శాతానికి చేరింది. అంతకుముందు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మే 2020లో రెపో రేటును తగ్గించింది. అయితే ఆ తర్వాత దానిని క్రమంగా 6.5 శాతానికి పెంచారు. కాని చివరిసారిగా రెపో రేటును ఫిబ్రవరి 2023లో పెంచారు. నేటి కోతతో రెపో రేటు ఇప్పుడు 6 శాతంగా మారింది.
రెపో రేటుతో EMI కనెక్షన్: రెపో రేటు అనేది నేరుగా బ్యాంకు రుణాలు తీసుకునే కస్టమర్లకు అనుసంధానించి ఉంటుంది. రెపో రేటు తగ్గుదల కారణంగా లోన్ EMI భారం కూడా తగ్గుతుంది. అలాగే రేపో రేటు కోత సామాన్యులకు ఏంతో ఊరటనిస్తోంది అని చెప్పవచ్చు. నిజానికి రెపో రేటు అంటే ఏదైనా నిధుల కొరత ఏర్పడినప్పుడు ఒక దేశం కేంద్ర బ్యాంకు లేదా రిజర్వ్ బ్యాంక్ వాణిజ్య బ్యాంకులకు డబ్బును అప్పుగా ఇచ్చే రేటు. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి ద్రవ్య అధికారులు రెపో రేటును ఉపయోగిస్తారు. ముఖ్యంగా చూస్తే రేపో రేటు తగ్గింపు కారణంగా మీ హోమ్ లోన్, పర్సనల్ లోన్, కారు లోన్ EMI తగ్గుతుంది. RBI డేటా ప్రకారం, 2024-25లో బ్యాంకుల సగటు టర్మ్ డిపాజిట్ రేటు (WADTDR) 6.91% వద్ద ఉంది, ఇది గత ఎనిమిది సంవత్సరాలలో అత్యధికం. ఆలాగే ఫిబ్రవరిలో ఈ రేటు 7.02%కి చేరుకుంది, అంటే తొమ్మిది సంవత్సరాలలో అత్యధికం.
బ్యాంక్ ఆఫ్ బరోడా చీఫ్ ఎకనామిస్ట్ మదన్ సబ్నవిస్ మాట్లాడుతూ, 'వడ్డీ రేటు తగ్గింపు ప్రయోజనాలను కస్టమర్ల పై బదిలీ చేయడం కష్టమైన పని, ఇది వివిధ బ్యాంకుల పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం మార్కెట్లో డబ్బు కొరత లేదు అలాగే ఈ పరిస్థితి కొంతకాలం వరకు కొనసాగుతుందని భావిస్తున్నట్లు తెలిపారు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications