నేడు ఆర్బీఐ ఎంపీసీ సమావేశంలో గవర్నర్ శక్తికాంత దాస్ కొన్ని కీలక ప్రకటనలు చేసారు. ఇందులో రేపో రేటుకు సంబంధించి రేపో రేటు ఎప్పటిలాగే 6.5 శాతంగా కొనసాగిస్తూ ఎలాంటి మార్పు చేయలేదు. అలాగే వ్యవసాయ రంగానికి ప్రయోజనం చేకూరుస్తు ఒక ముఖ్యమైన ప్రకటన చేసారు. చిన్న ఇంకా మధ్యతరహా రైతులకు ఆర్థిక సహాయం అందించే ప్రయత్నంలో భాగంగా ఆర్బీఐ రైతులకు
ఎలాంటి పూచీకత్తు లేని రుణాల పరిమితిని పెంచింది.
కొలేటరల్ ఫ్రీ లోన్
ఆర్‌బీఐ రైతులకు ఎలాంటి పూచీకత్తు లేని రుణాల పరిమితిని పెంచింది. ఈ పరిమితి ఇప్పుడు రూ.1.6 లక్షల నుంచి రూ.2 లక్షలకు పెంచారు. దీని వల్ల చిన్న రైతులకు ఎంతో మేలు జరుగుతుంది. ఈ నిర్ణయంతో రైతులు ఇకపై రూ.2 లక్షల వరకు రుణాల కోసం బంగారం/ఇల్లు లాంటివి తనఖా పెట్టాల్సిన అవసరం ఉండదు. ఇంతకుముందు ఈ పరిమితి రూ.1.6 లక్షలుగా ఉంది, అంటే ఇంతకుముందు ఎలాంటి తనఖా లేకుండా రైతులు రూ.1.6 లక్షల వరకు మాత్రమే లోన్ తీసుకునే అవకాశం ఉండగా, ఇప్పుడు ఆ పరిమితి రూ.2 లక్షలకు పెరిగింది.

ఈ డాకుమెంట్స్ అవసరం
ఆర్బీఐ తీసుకున్న ఈ నిర్ణయం ప్రకారం, రైతులు ఇప్పుడు ఎలాంటి తనఖా లేకుండా రూ. 2 లక్షల వరకు లోన్ తీసుకోవచ్చు, అయితే దీని కోసం కొన్ని అవసరమైన డాకుమెంట్స్ అందించాలి. పాన్ కార్డు, ఆధార్ కార్డు, వ్యవసాయానికి సంబంధించిన డాకుమెంట్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇంతకంటే ఎక్కువ మొత్తం లోన్ రూపంలో కావాలంటే సీఎన్‌బీసీ ప్రకారం పెద్ద మొత్తం రుణాలకు భూమికి సంబంధించిన డాకుమెంట్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటుందని ప్రముఖ బ్యాంకు తెలిపింది. అంతేకాకుండా ఒకోసారి భూమిని కూడా తనఖా పెట్టాల్సి రావొచ్చు. ఈ తనఖా పెట్టడం ఎందుకంటే మీరు లోన్ తిరిగి చెల్లించలేకపోతే ఆ మొత్తాన్ని తనఖా పెట్టిన భూమి ద్వారా జప్తు చేసుకుంటుంది.
ఎవరైనా లోన్ తీసుకోవడానికి బ్యాంకు లేదా ఏదైనా నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ (NBFC) వెళ్లినప్పుడు లోన్ కోసం ఏదైనా తాకట్టు పెట్టమని అడుగవచ్చు. రైతులకు కూడా ఇదే నిబంధన ఉంటుంది కానీ కొలేటరల్ ఫ్రీ లోన్ కోసం ఎలాంటి తాకట్టు అవసరం లేదు. రైతులు తీసుకున్న ఇలాంటి రుణాలపై ప్రభుత్వం రుణమాఫీ కూడా ప్రకటిస్తుంది. ఈ రుణమాఫీకి సంబంధించి నిర్ణిత మొత్తనికి ప్రభుత్వం ఎలాంటి షరతులు లేకుండా మాఫీ చేస్తుంది. ఈ ప్రభుత్వ చర్య కూడా లోన్ తీసుకున్న రైతులకి ఎంతో మేలు చేకూరుస్తుంది.


Click it and Unblock the Notifications