RBI MPC meeting: లతా మంగేష్కర్ మృతి, MPC సమావేశం వాయిదా
గానకోకిల, భారతరత్న లతా మంగేష్కర్ ఆదివారం కన్నుమూశారు. దీంతో భారత ప్రభుత్వం రెండు రోజుల పాటు సంతాపదినంగా ప్రకటించింది. మహారాష్ట్ర ప్రభుత్వం కూడా సోమవారం సెలవుదినంగా ప్రకటించింది. దీంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) ఆ రాష్ట్రంలో అన్ని బ్రాంచీలను క్లోజ్ చేస్తున్నట్లు ప్రకటించింది. అలాగే, ఆర్బీఐ నేటి నుండి ప్రారంభం కావాల్సిన మానిటరీ పాలసీ సమావేశాన్ని కూడా వాయిదా వేసింది. MPC సమావేశాన్ని రీషెడ్యూల్ చేస్తున్నట్టు ఆర్బీఐ ఆదివారం ప్రకటించింది. దీంతో సోమవారం ప్రారంభం కావాల్సిన సమావేశం మంగళవారం ప్రారంభమవుతుంది.
ఆర్బీఐ పరపతి సమావేశం కోసం వేచి చూస్తున్నారు. ఈసారి MPC సమావేశంలో వడ్డీ రేట్లు పెంచే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఆర్థిక రికవరీ కనిపించడంతో క్రమంగా వడ్డీ రేట్ల పెంపు ఉంటుందని భావిస్తున్నారు. ఈసారి పెంచకపోయినా, వచ్చేసారి పెంచేందుకు హింట్ ఇవ్వవచ్చునని భావిస్తున్నారు. రేపటి నుండి మూడు రోజుల పాటు ఎంపీసీ సమావేశం ఉంటుంది. గురువారం నాడు ఆర్బీఐ గవర్నర్ మానిటరీ పాలసీ నిర్ణయాలను ప్రకటిస్తారు.

లతా మంగేష్కర్ డెబ్బై ఏళ్లు భారతీయ సినీ పరిశ్రమలో ఉన్నారు. 92 ఏళ్ల వయస్సులో కన్నుమూశారు. 1948లో దిల్ మేర తోడా, ముఝే కహీ కా నా చోరా అనే పాటతో లతకు బ్రేక్ వచ్చింది. ఆమె పాటకు పలుమార్లు జాతీయ పురస్కారం లభించింది. 1993లో ఫిల్మ్ ఫేర్ జీవన సాఫల్య పురస్కారం అందుకున్నారు. లత 28 సెప్టెంబర్ 1929లో మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జన్మించారు. ఆమె తొలిపేరు హేమ. తండ్రి దీనానాథ్ మంగేష్కర్. తల్లి సుధామతి. చెల్లెళ్ళు, తమ్ముడు మీన, ఆశా, ఉష, హృదయనాథ్.


Click it and Unblock the Notifications