రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) వడ్డీ రేటును స్థిరంగా కొనసాగించింది. ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ బుధవారం నుండి శుక్రవారం వరకు మూడు రోజుల పాటు సమావేశమై, కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ భేటీకి సంబంధించిన వివరాలను ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ నేడు (శుక్రవారం, అక్టోబర్ 8) మీడియాకు వివరించారు. ఈ సందర్భంగా రివర్స్ రెపో రేటును, రెపో రేటును స్థిరంగా కొనసాగించింది. వరుసగా ఎనిమిదో సారి రెపో రేటును 4 శాతంగా, రివర్స్ రెపో రేటును 3.5 శాతంగా కొనసాగిస్తున్నట్లు శక్తికాంతదాస్ తెలిపారు. వడ్డీ రేట్లు స్థిరంగా కొనసాగించేందుకు 5-1 ఓట్లు పడ్డాయి. ఈ సందర్భంగా ఆర్బీఐ గవర్నర్ మాట్లాడారు.
ప్రస్తుతం కరోనా నుండి కోలుకొని, ఆర్థిక వ్యవస్థ వేగంగా పుంజుకుంటోందని, మంచి రికవరీతో భారత్ ఇప్పుడు మంచి స్థానంలో ఉందని శక్తికాంత దాస్ అన్నారు. గత ఏఎంపీసీ సమావేశం సమయంతో పోలిస్తే ఇప్పుడు బాగుందని చెప్పారు. వృద్ధి క్రమంగా మెరుగుపడుతోందని, ద్రవ్యోల్భణం అంచనాలకు మించి ఉందని తెలిపారు. ఇంధన పన్నులు ద్రవ్యోల్భణం తగ్గుదలకు దోహదం చేస్తాయన్నారు. అంచనాల కంటే ద్రవ్యోల్భణం తక్కువగా ఉందన్నారు. సమష్టి డిమాండ్ క్రమంగా పెరుగుతోందని, అయినప్పటికీ కాస్తనెమ్మదిగా ఉందని, ఆ పండుగ సీజన్ పట్టణ డిమాండ్‌ను తీర్చేవిధంగా ఉండాలన్నారు.

క్రితం మానిటరీ పాలసీ సందర్భంగా శక్తికాంత దాస్ మాట్లాడుతూ కేంద్ర బ్యాంకు రెపో రేటును ప్రస్తుతం స్థిరంగా కొనసాగిస్తుందని, అలాగే, వృద్ధికి మద్దతు ఇవ్వడానికి అవసరమున్నంత వరకు ఇలాంటి అనుకూల వైఖరిని కొనసాగిస్తుందని కూడా అప్పుడే స్పష్టం చేశారు. ఇప్పుడు దానిని కొనసాగించారు. పండుగ డిమాండ్ నేపథ్యంలో వినియోగంపై ఆర్థిక వ్యవస్థ ఎంతో ఆసక్తిగా ఉందని, ఈ నేపథ్యంలో పాలసీ వడ్డీ రేటుకు సంబంధించి ఆశ్చర్యకర నిర్ణయాలు ఉంటాయని తాము ఆశించడం లేదంటూ.. వడ్డీ రేటు సవరణ ఉండదని ఆర్థిక నిపుణులు ఇప్పటికే అభిప్రాయపడ్డారు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications