RBI MPC Meet: యూపీఐకి రూపే క్రెడిట్ కార్డ్స్ లింక్

రూపే క్రెడిట్ కార్డులను యూపీఐకి అనుసంధానించాలని ఆర్బీఐ ప్రతిపాదించింది. ఈ మేరకు ఆర్బీఐ గవర్నర్ తెలిపారు. ఇది కస్టమర్ల మరింత సౌలభ్యం కలిగిస్తుందని, డిజిటల్ చెల్లింపుల పరిధిని విస్తృతపరుస్తుందన్నారు. RBI మానిటరీ పాలసీ కమిటీ జూన్ 6వ తేదీ నుండి 8వ తేదీ వరకు సమావేశమైంది. ఈ భేటీకి సంబంధించిన కీలక నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ ఈ రోజు (జూన్ 8, 2022) మీడియాకు వివరించారు. ఈ సందర్భంగా రూపే క్రెడిట్ కార్డు, యూపీఐ అనుసంధానం గురించి తెలిపారు. డిజిటల్ చెల్లింపుల వ్యవస్థను ప్రజలకు మరింత చేరువ చేసేలా ఆర్బీఐ చర్యలు ప్రకటించింది.

అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులు దేశీయ ఆర్థిక వ్యవస్థకు సవాల్‌గా మారాయని శక్తికాంతదాస్ అన్నారు. కరోనా తగ్గుతున్న పరిస్థితుల్లో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా సరఫరా వ్యవస్థలో ఇబ్బందులు తలెత్తి, ద్రవ్యోల్భణంపై ఒత్తిడి పెరిగిందన్నారు.

RBI MPC Meet: UPI Linking to RuPay Credit Cards

గ్రామీణ సహకార బ్యాంకులు కమర్షియల్ రియల్ ఎస్టేట్‌కు రుణాలు ఇవ్వడానికి అనుమతిస్తున్నట్లు తెలిపారు. అలాగే, పట్టణ సహకార బ్యాంకులు ఇంటి వద్దకే బ్యాంకింగ్ సేవలను ప్రారంభించేందుకు అనుమతి ఇచ్చింది ఆర్బీఐ. సాధారణ వర్షపాతం వల్ల ద్రవ్యోల్భణం అదుపులోకి రావొచ్చునని ఆశాభావం వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో ధరలు మరింత పెరిగే అవకాశం లేదని అభిప్రాయపడ్డారు. ఈ-మాండేట్ లిమిట్ రూ.15,000కు పెంచినట్లు ఆర్బీఐ తెలిపింది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+