2022-23 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్భణం 6.7 శాతంగా నమోదు కావొచ్చునని ఆర్బీఐ అంచనా వేసింది. గతంలో దీనిని 5.7 శాతంగా అంచనా వేయగా, దీనిని తాజాగా సవరించినట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. RBI మానిటరీ పాలసీ కమిటీ జూన్ 6వ తేదీ నుండి 8వ తేదీ వరకు సమావేశమైంది. ఈ భేటీకి సంబంధించిన కీలక నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ ఈ రోజు (జూన్ 8, 2022) మీడియాకు వివరించారు. తాజాగా రెపో రేటును మరో 50 బేసిస్ పాయింట్లు తగ్గించగా, FY23 జీడీపీ వృద్ధి రేటు అంచనాలను 7.2 శాతంగా అంచనా వేస్తోంది. ద్రవ్యోల్భణం అంచనాలను కూడా వెల్లడించారు దాస్.
FY23లో సీపీఐ ద్రవ్యోల్భణం గతంలోని 5.7 శాతం నుండి 6.7కి సవరించారు. త్రైమాసికం ప్రాతిపదికన చూస్తే ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో 6.3 శాతం నుండి 7.5 శాతానికి, జూలై - సెప్టెంబర్ త్రైమాసికంలో 5.8 శాతం నుండి 7.4 శాతానికి, అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో 5.4 శాతం నుండి 6.2 శాతానికి, జనవరి-మార్చి త్రైమాసికంలో 5.1 శాతం నుండి 5.8 శాతానికి పెంచారు.

భారత ఫారెక్స్ రిజర్వ్స్ జూన్ 3, 2022తో ముగిసిన వారానికి 601.1 బిలియన్ డాలర్లకు పెరిగినట్లు ఆర్బీఐ గవర్నర్ తెలిపారు. తాము జీ-సెక్ మార్కెట్‌ను గమనిస్తున్నామని, అవసరమైన పక్షంలో సరైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇదిలా ఉండగా, ఆర్బీఐ రెపో రేటును గత నెలలో అత్యవసరంగా సమావేశమై 40 బేసిస్ పాయింట్లు, తాజా ఎంపీసీ సమావేశంలో 50 బేసిస్ పాయింట్లు పెంచడంతో 4.90 శాతానికి చేరుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి రెపో రేటును 4.6 శాతానికి చేర్చే అవకాశాలున్నాయి.


Click it and Unblock the Notifications