For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

RBI MPC Meet: FY23 జీడీపీ వడ్డీ రేటు అంచనా 7.2 శాతం

|

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను భారత జీడీపీ వృద్ధి రేటు అంచనాలను 7.2 శాతాన్ని స్థిరంగా కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. RBI మానిటరీ పాలసీ కమిటీ జూన్ 6వ తేదీ నుండి 8వ తేదీ వరకు సమావేశమైంది. ఈ భేటీకి సంబంధించిన కీలక నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ ఈ రోజు (జూన్ 8, 2022) మీడియాకు వివరించారు. ఈ సందర్భంగా రెపో రేటును మరో 50 బేసిస్ పాయింట్లు పెంచారు. గత ఐదు వారాల్లో మొత్తంగా 90 బేసిస్ పాయింట్లు పెంచి, వడ్డీ రేటును 4.90 శాతానికి పెంచింది. అదే సమయంలో జీడీపీ వృద్ధి రేటు అంచనాలను కూడా శక్తికాంతదాస్ వెల్లడించారు.

FY23లో వృద్ధి రేటు అంచనాలు 7.2 శాతంతో స్థిరంగా కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ఏప్రిల్-జూన్ మొదటి త్రైమాసికంలో 16.2 శాతం, జూలై-సెప్టెంబర్ రెండో త్రైమాసికంలో 6.2 శాతం, అక్టోబర్ - డిసెంబర్ మూడో త్రైమాసికంలో 4.1 శాతం, జనవరి - మార్చి నాలుగో త్రైమాసికంలో 4.0 శాతానికి సవరించింది.

 RBI MPC Meet: GDP Forecast for FY23 Retained at 7.2 percent

ఈ సందర్భంగా శక్తికాంతదాస్ మాట్లాడుతూ.. ఏప్రిల్-మే కాలంలో ఆర్థిక రికవరి కాస్త పుంజుకుందని తెలిపారు. అర్బన్ డిమాండ్ పుంజుకుందని, రూరల్ డిమాండ్ కూడా క్రమంగా పెరుగుతోందని చెప్పారు. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ జనవరి - మార్చి కాలంలో వృద్ధిని సాధించిందని తెలిపారు. కాగా, ఆర్బీఐ రెపో రేటు పెంపు గత ఐదు వారాల్లో ఇది రెండోసారి.

English summary

RBI MPC Meet: FY23 జీడీపీ వడ్డీ రేటు అంచనా 7.2 శాతం | RBI MPC Meet: GDP Forecast for FY23 Retained at 7.2 percent

FY23 GDP growth seen evolving broadly along April forecast. GDP growth forecast for FY23 retained at 7.2 percent.
Story first published: Wednesday, June 8, 2022, 10:49 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X