ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా నాయకత్వంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నేడు రెపో రేటులో 25 బేసిస్ పాయింట్ల తగ్గిస్తూ ప్రకటించింది, దింతో రేపో రేట్ 6.25 శాతం నుండి 6 శాతానికి చేరింది. సోమవారం నుండి బుధవారం వరకు జరిగిన 2025-26 ఆర్థిక సంవత్సర ఆర్బీఐ మొదటి మానిటరీ పాలసీ కమిటీ సమావేశాల తర్వాత ఈ నిర్ణయాలు వెలువడ్డాయి. గత నెల ఫిబ్రవరిలో జరిగిన MPC సమావేశంలో రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన సంగతి మీకు తెలిసిందే. భారత ఆర్థిక వ్యవస్థ బలహీనమైన వృద్ధిని ఎదుర్కొంటున్నందున, స్థిరత్వాన్ని ప్రోత్సహించడానికి RBI విధానాలను సర్దుబాటు చేస్తూనే ఉంటుందని భావించారు.

RBI MPC ప్రకటనల నుండి హైలెట్స్
*రెపో రేటును 25 బేసిస్ పాయింట్ల కోతతో 6 శాతానికి తగ్గింపు.
*మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ (MSF) రేటును 6.25 శాతానికి మార్పు చేశారు.
*RBI ఇప్పుడు FY26కి రియల్ GDP వృద్ధిని 6.5 శాతంగా అంచనా వేసింది. ప్రపంచ పరిణామాలపై రిజర్వ్ బ్యాంకు అప్రమత్తంగా ఉందని RBI గవర్నర్ అన్నారు.
*ద్రవ్యోల్బణం ప్రస్తుతం టార్గెట్ కంటే తక్కువగా ఉంది, ఆహార ధరలలో తగ్గుదల, మెరుగైన ద్రవ్యోల్బణ అంచనా దీనికి దోహదపడింది. *FY26కి ద్రవ్యోల్బణం 4 శాతంగా అంచనా వేయగా, ఫిబ్రవరిలో 4.2 శాతం, FY26 నాలుగు త్రైమాసికాలకు ద్రవ్యోల్బణం Q1లో 3.6 శాతం,Q2లో 3.9 శాతం, Q3లో 3.8 శాతం, Q4లో 4.4 శాతంగా ఉంటుందని అంచనా వేసింది.
* 4 ఏప్రిల్ 2025 నాటికి విదేశీ మారక నిల్వలు $676.3 బిలియన్లుగా ఉన్నాయి.
ఫిబ్రవరిలో ఆర్‌బిఐ ఎంపిసి సమావేశం: ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన MPC సమావేశంలో కమిటీ రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించి 6.25 శాతానికి మార్చింది, దాదాపు ఐదు సంవత్సరాలలో మొదటిసారి తగ్గింపు వచ్చింది. దీనికి తోడు లిక్విడిటీ పెంచడానికి, క్రెడిట్ వృద్ధికి మద్దతు ఇవ్వడానికి క్యాష్ రిజర్వ్ రేషియో (CRR)లో 50 బేసిస్ పాయింట్ల తగ్గింపుతో 4 శాతానికి ప్రకటించారు. RBI ఆర్థిక సంవత్సరం 24-25 సంవత్సరానికి భారతదేశ GDP వృద్ధిని 7.2 శాతంగా అంచనా వేయగా, ఇది ఆర్థిక సర్వే అంచనా వేసిన 6.4 శాతం కంటే కొంచెం ఎక్కువగానే ఉంది, ద్రవ్యోల్బణం నియంత్రణలో ఉంటుందని కూడా అంచనా వేసింది.


Click it and Unblock the Notifications