ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (FY22)లో భారత జీడీపీ వృద్ధి రేటు 9.5 శాతంగా ఉండవచ్చునని కేంద్ర బ్యాంకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) అంచనా వేసింది. సీపీఐ ద్రవ్యోల్భణం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 5.3 శాతంగా నమోదు కావొచ్చునని పేర్కొంది. ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ బుధవారం నుండి శుక్రవారం వరకు 3 రోజుల పాటు సమావేశమై, కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ భేటీకి సంబంధించిన వివరాలను ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ నేడు (శుక్రవారం, అక్టోబర్ 8) మీడియాకు వివరించారు. ఆర్బీఐ అంచనాల కంటే ద్రవ్యోల్భణం తక్కువగా ఉందని శక్తికాంత దాస్ తెలిపారు. కోర్ ద్రవ్యోల్భణం స్టిక్కీగా ఉందన్నారు.
సీపీఐ ద్రవ్యోల్భణం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 5.3 శాతంగా ఉండవచ్చునని అంచనా వేసింది. FY22 రెండో త్రైమాసికంలో 5.1 శాతం, మూడో త్రైమాసికంలో 4.5 శాతం, నాలుగో త్రైమాసికంలో 5.8 శాతంగా నమోదవుతుందని ఆర్బీఐ అంచనా వేసింది.

కేంద్ర బ్యాంకు ఆర్బీఐ జీ-సాప్ కింద బాండ్ కొనుగోళ్లను నిలిపివేస్తుందని శక్తికాంత దాస్ తెలిపారు. తాజాగా జీఎస్టీ కంపెన్సేషన్ కోసం ప్రభుత్వం రుణాలు తీసుకోవడం లేదన్నారు. దీంతో జీ-సాప్ ద్వారా మరింత బాండ్ కొనుగోలు అవసరం తలెత్తదన్నారు. ఆర్బీఐ అవసరమైన మేరకు బహిరంగ మార్కెట్ కార్యకలాపాలను కొనసాగిస్తుందన్నారు.
RBI వడ్డీ రేటును స్థిరంగా కొనసాగిస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. రివర్స్ రెపో రేటును, రెపో రేటును స్థిరంగా కొనసాగించింది. వరుసగా ఎనిమిదో సారి రెపో రేటును 4 శాతంగా, రివర్స్ రెపో రేటును 3.5 శాతంగా కొనసాగిస్తున్నట్లు శక్తికాంతదాస్ తెలిపారు. వడ్డీ రేట్లు స్థిరంగా కొనసాగించేందుకు 5-1 ఓట్లు పడ్డాయి. ప్రస్తుతం కరోనా నుండి కోలుకొని, ఆర్థిక వ్యవస్థ వేగంగా పుంజుకుంటోందని, మంచి రికవరీతో భారత్ ఇప్పుడు మంచి స్థానంలో ఉందని శక్తికాంత దాస్ అన్నారు. గత ఏఎంపీసీ సమావేశం సమయంతో పోలిస్తే ఇప్పుడు బాగుందని చెప్పారు. వృద్ధి క్రమంగా మెరుగుపడుతోందని, ద్రవ్యోల్భణం అంచనాలకు మించి ఉందన్నారు. ఇంధన పన్నులు ద్రవ్యోల్భణం తగ్గుదలకు దోహదం చేస్తాయన్నారు. అంచనాల కంటే ద్రవ్యోల్భణం తక్కువగా ఉందన్నారు. సమష్టి డిమాండ్ క్రమంగా పెరుగుతోందని, అయినప్పటికీ కాస్త నెమ్మదిగా ఉందని, ఆ పండుగ సీజన్ పట్టణ డిమాండ్‌ను తీర్చేవిధంగా ఉండాలన్నారు.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!



Click it and Unblock the Notifications