ఆగస్టు 6న ఆర్బీఐ నుంచి కీలక ప్రకటన..ఈసారి EMI చౌకగా ఉంటుందా? 3 రోజుల ఎంపిసి సమావేశాలు స్టార్ట్..
ఆర్‌బిఐ ద్రవ్య విధాన కమిటీ (ఎంపిసి) సమావేశాలు ఈరోజు నుండి మూడు రోజుల వరకు జరగనున్నాయి. గవర్నర్ సంజయ్ మల్హోత్రా నేతృత్వంలో జరిగే ఈ సమావేశంలో రెపో రేటులో ఏదైనా మార్పు ఉంటుందా లేదా అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఫిబ్రవరి నుండి ప్రారంభమైన రెపోరేటు తగ్గింపు వేగంలో ఇప్పటివరకు 100 బేసిస్ పాయింట్ల ఉపశమనం ఇవ్వబడింది. అయితే ఈసారి వాతావరణం కొద్దిగా భిన్నంగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఆగస్టు 7 నుండి అమెరికా భారతదేశంపై 25 శాతం సుంకం విధించబోతోంది. ఇది ఆర్‌బిఐ ఆలోచనను కొంత ఇబ్బందుల్లో పడేసిందని తెలుస్తోంది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) ద్రవ్య విధాన కమిటీ (MPC) మూడు రోజుల సమావేశంలో దేశ ఆర్థిక పరిస్థితుల నేపథ్యాన్ని పరిశీలించనున్నారు. తద్వారా రెపో రేటులో మార్పు చేయాలా వద్దా అనే అంశంపై నిర్ణయం తీసుకోనున్నారు. ఈ సారి రెపో రేటు తగ్గింపు విషయంలో పరిస్థితులు గతంతో పోలిస్తే భిన్నంగా ఉన్నాయన్నది నిపుణుల అభిప్రాయంగా చెబుతున్నారు. ఆగస్టు 7 నుంచి అమెరికా భారత దిగుమతులపై 25% సుంకం నిర్ణక్ష్ం భారత ఆర్థికతపై ఒత్తిడి పెంచే అవకాశం ఉండడంతో.. ఆర్‌బిఐ వడ్డీ రేటు కోత విషయంలో జాగ్రత్తగా వ్యవహరించే అవకాశం ఉంది.

బ్యాంక్ ఆఫ్ బరోడా చీఫ్ ఎకనామిస్ట్ మదన్ సబ్నవిస్ ప్రకారం.. ఈ అమెరికా టారిఫ్ ఇప్పటికే వృద్ధిపై ప్రభావం చూపుతోందన్నారు.అయితే దానిని దృష్టిలో పెట్టుకొని RBI కొత్తగా రేట్లను తగ్గించదని అభిప్రాయం వ్యక్తం చేశారు.జూన్ నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం కేవలం 2.1 శాతం మాత్రమే ఉంది. ఇది ఆర్‌బీఐ లక్ష్యం అయిన 4 శాతం కన్నా తక్కువగానే ఉంది. దీంతో ద్రవ్యోల్బణం అనుకూలంగా ఉన్నప్పటికీ, టారిఫ్ అనిశ్చితి వలన ఆర్‌బిఐ వెంటనే చర్య తీసుకోవడం కష్టమవుతుందని అంటున్నారు.
ఇక్రా చీఫ్ ఎకనామిస్ట్ అదితి నాయర్ అభిప్రాయం ప్రకారం, ద్రవ్యోల్బణ అంచనాలు తగ్గినందున ఆగస్టులో RBI మరో 25 బేసిస్ పాయింట్లు తగ్గించవచ్చని భావిస్తున్నారు.అయితే ఎస్‌బిఎం బ్యాంక్ నిపుణుడు మందర్ పిటాలే అభిప్రాయం ప్రకారం చూసుకున్నట్లమితే టారిఫ్‌లపై అనిశ్చితి వలన RBI తక్షణ నిర్ణయం తీసుకోకపోవచ్చని చెబుతున్నారు. MSME రంగం ప్రస్తుతం ఆర్థిక ఒత్తిడిలో ఉంది. పండుగ సీజన్ దృష్ట్యా, రుణాలపై వడ్డీ తగ్గితే చిన్న వ్యాపారాలకు ఉపశమనం కలుగుతుందని Biz2Credit CEO రోహిత్ అరోరా చెబుతున్నారు.ఇక రియల్ ఎస్టేట్ రంగం కూడా వడ్డీ తగ్గింపుపై ఆశలు పెట్టుకుంది. ఇది కొనుగోలుదారుల విశ్వాసాన్ని పెంచుతుంది అని జేపీ ఇన్‌ఫ్రాటెక్ ప్రతినిధి జాష్ పంచామియా తెలిపారు.
MPC సభ్యులు ఎవరెవరంటే..
1. సంజయ్ మల్హోత్రా (గవర్నర్)
2. పూనమ్ గుప్తా (డిప్యూటీ గవర్నర్)
3. రాజీవ్ రంజన్ (ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్)
4. నగేష్ కుమార్ (బాహ్య సభ్యుడు)
5. సౌగతా భట్టాచార్య
6. రామ్ సింగ్
ఈ వారం ఆగస్టు 6 లేదా 7న RBI రెపోరేటుపై తమ నిర్ణయాన్ని ప్రకటించనుంది. వడ్డీ రేట్లు కట్స్ వస్తాయా లేదా అన్న విషయం.. దేశ ఆర్థిక పరిస్థితులకు కీలక మలుపుగా మారబోతోంది.


Click it and Unblock the Notifications