RBI News: పెరుగుతున్న బంగారం ధరలను చూసి సామాన్యుడు బెంబేలెత్తిపోతున్నాడు. భవిష్యత్తులో అసలు కొనుగోలు చేయలేమోనని ఆందోళన వ్యక్తం అవుతోంది. అటువంటి ఈ సమయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బంగారం కొండను కదిలించింది. విదేశాల్లో మూలుగుతున్న భారత్ పసిడిని తిరిగి స్వదేశానికి తీసుకొచ్చింది. ఇప్పుడు అర్జెంట్‌గా ఇండియా తీసుకురావాల్సిన అవసరం ఏమిటోనని ప్రజల్లో చర్చ మొదలైంది.
మార్చి 2024 చివరి నాటికి RBI వద్దనున్న మొత్తం బంగారం నిల్వలు 822.10 మెట్రిక్ టన్నులు అని గణాంకాలు చెబుతున్నాయి. అయితే ఇందులో సింహభాగం విదేశాల్లో నిల్వ చేయబడింది. ప్రపంచంలోని ఇతర దేశాల మాదిరిగానే భారత్ కూడా తన పసిడిని ఏళ్ల తరబడి బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ వద్ద భద్రపరిచింది.

అయితే ఇప్పటి వరకు UKలో నిల్వ చేసిన 100 మెట్రిక్ టన్నుల బంగారాన్ని RBI తాజాగా దేశీయ వాల్ట్‌లకు తరలించింది. 1991 తర్వాత ఈ స్థాయిలో బంగారాన్ని స్వదేశానికి బదిలీ చేయడం ఇదే మొదటిసారి కావడం విశేషం. ఈ నిల్వల మొత్తంలో కొంత భాగాన్ని విదేశీ మారక ద్రవ్య సంక్షోభం తలెత్తినప్పుడు వినియోగించడానికి వినియోగిస్తారు.
తాజా తరలింపుతో దేశంలో నిల్వ చేయబడుతున్న RBI బంగారం 408 టన్నులకు చేరినట్లు తెలుస్తోంది. అంటే మొత్తం 822లో దాదాపు సగభాగం భారత్‌లో మరో సగం విదేశాల్లో ఉంది. సెంట్రల్ బ్యాంక్ వార్షిక నివేదిక ప్రకారం FY24కి గాను 308 మెట్రిక్ టన్నుల బంగారాన్ని జారీ చేయబడిన నోట్ల కోసం ఉంచారు. మరో 100కు పైగా టన్నులు బ్యాంకింగ్ విభాగానికి చెందిన ఆస్తిగా పరిగణిస్తున్నారు.
అంతర్జాతీయ మార్కెట్ల నుంచి కోనుగోలు చేసిన బంగారాన్ని విదేశాల్లో నిల్వ చేయడం సాధారణంగా జరిగే వ్యవహారమే. అయితే రష్యా-ఉక్రెయిన్ యద్ధం వంటి భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతల వేళ మాస్కోకు చెందిన విదేశాల్లోని ఆస్తులను ఆయా దేశాలు స్తంభింపచేశాయి. ఇటువంటి సందర్భాల్లో ఇతర దేశాల్లో పసిడిని దాచి ఉంచడం ప్రమాదకరం.
సాధారణ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా వంటి కీలక నేతలు పాకిస్తాన్ మరియు POK గురించి చేసిన వ్యాఖ్యలు అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. దీనికితోడు 400 MP స్థానాలు ఇవ్వాలని ప్రధాని కోరడం, RBI సడెన్‌గా బంగారాన్ని స్వదేశానికి తరలించడం పలు సందేహాలు కలిగిస్తోంది. రానున్న రోజుల్లో ఇండియా బిగ్ స్టెప్ తీసుకోవచ్చని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
More From GoodReturns

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల ఎంతో తెలుసా.. మార్చి 20, శుక్రవారం ధరలు ఇవే..

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Bengaluru: ట్రాఫిక్ కష్టాలకు గుడ్ బై.. ఈ యువతి ఐడియా నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది!

క్రెడిట్ కార్డు క్లోజ్ చేసిన 10 ఏళ్ళ తర్వాత రూ. 33 లక్షలు కట్టాలని బ్యాంక్ నోటీసులు.. కస్టమర్ ఏం చేశాడంటే..

బంగారం ధరలు ఈ స్థాయి వద్దకు దిగబోతున్నాయి.. కొనుగోలుపై కీలక నిర్ణయం తీసుకోమంటున్న ఆర్థిక నిపుణులు

Bengaluru: సిలికాన్ వ్యాలీకి ఏమైంది? టెక్ కంపెనీలు బెంగళూరుని వదిలి ఎందుకు వెళ్లిపోతున్నాయి?



Click it and Unblock the Notifications