ఆర్బీఐ మానిటరీ పాలసీ సహా.. స్టాక్ మార్కెట్‌పై వీటి ప్రభావం
భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలను తగ్గించడం, ముడి చమురు ధరల క్షీణత, FIIలు, DIIలతో నికర కొనుగోలుదారులతో ఇండియన్ సెకండరీ మార్కెట్ FY23ని బలంగా ప్రారంభించింది. మార్చి నెలలో భారత్ జీఎస్టీ కలెక్షన్లు అదరగొట్టాయి. రూ.1.42 లక్షల కోట్లతో ఆల్ టైమ్ రికార్డును తాకింది. ఇవి దలాల్ మార్కెట్‌కు సానుకూలతను అందించాయి. స్టాక్ మార్కెట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం వచ్చే వారం ఆర్బీఐ మానిటరీ పాలసీ ఉంటుంది. ఆర్బీఐ క్రెడిట్ పాలసీతో పాటు ఆర్బీఐ-ఉక్రెయిన్ వార్తలపై కూడా దృష్టి సారించాల్సి ఉందని అంటున్నారు.
క్రూడాయిల్ ధరలు తగ్గడం, రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి సానుకూల సంకేతాలు, ఎఫ్ఐఐ కొనుగోళ్లు, డీఐఐ నిరంతర మద్దతు కారణంగా ఈ ఆర్థిక సంవత్సరాన్ని భారత్ సానుకూలంగా ప్రారంభించిందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. మరోవైపు పారిశ్రామిక కార్యకలాపాలు కూడా పుంజుకున్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. చైనా కరోనాతో పోరాడుతోంది. ఇది సరఫరా చైన్ పైన, తద్వారా ద్రవ్యోల్భణంపై ప్రభావం చూపించవచ్చు.

స్టాక్ మార్కెట్ పైన ఆర్బీఐ క్రెడిట్ పాలసీ, రష్యా ఉక్రెయిన్ అంశాలు, ఎఫ్ఐఐ, డీఐఐ, గత త్రైమాసికం అలాగే, గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కంపెనీల ఫలితాలు స్టాక్ మార్కెట్ పైన ప్రభావం చూపుతాయి.


Click it and Unblock the Notifications