వడ్డీ రేట్లను స్థిరంగా కొనసాగిస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) మానిటరీ పాలసీ కమిటీ(MPC) నిర్ణయించింది. 8వ తేదీన ప్రారంభమై, 10వ తేదీన ముగిసింది మానిటరీ పాలసీ. నేడు (10, ఫిబ్రవరి) ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ MPC సమావేశం నిర్ణయాలను మీడియాకు తెలిపారు. ఈ సందర్భంగా రెపో రేటును 4 శాతంగా కొనసాగిస్తున్నట్లు తెలిపారు. వరుసగా పదోసారి రెపో రేటును స్థిరంగా కొనసాగించారు.
ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్ల పెంపు సంకేతాలు ఇచ్చాయి. కొన్ని ఆర్థిక వ్యవస్థలు ఇప్పటికే ఈ దిశగా అడుగులు వేశాయి. యూఎస్ ఫెడ్ రిజర్వ్ వచ్చే నెలలో వడ్డీ రేట్లు పెంచనుంది. ఇదే దిశలో ఆర్బీఐ కూడా పెంచే అవకాశాలు ఉన్నాయా లేదా కనీసం సంకేతాలు ఇస్తుందా అనే చర్చ సాగింది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో వడ్డీ రేట్లు యథాతథంగా కొనసాగిస్తున్నారు.

కీలక వడ్డీ రేట్లు మరిన్ని నెలల పాటు యథాతథంగా కొనసాగించే అవకాశాలు ఉన్నాయని ఓ సర్వేలో కూడా వెల్లడైంది. కరోనా నుండి కోలుకుంటున్న భారత్ పైన ఒమిక్రాన్ ప్రభావం చూపింది. అయితే ఆర్థిక కార్యకలాపాలు మరీ అంతగా పతనం కాలేదు. ద్రవ్యోల్భణం కూడా భారీగా పెరుగుతోంది. కానీ ఇతర దేశాలతో పోలిస్తే ద్రవ్యోల్భణం కాస్త అదుపులో ఉందని చెబుతున్నారు. అంతర్జాతీయ ముడి చమురు ధరలు ఏడేళ్ల గరిష్టానికి చేరుకోవడంతో ఈ ప్రభావం మనపై పడుతుంది. ఇది ద్రవ్యోల్భణ పెరుగుదలకు దారితీస్తుంది.
More From GoodReturns

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..



Click it and Unblock the Notifications