ముంబై: 2019-20 ఆర్థిక సంవత్సరానికి గాను చివరి ద్వైమాసిక ద్రవ్య, పరపతి విధాన సమీక్షలో కీలక వడ్డీ రేట్లలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఎలాంటి మార్పులు చేయలేదు. ఈ సమీక్షలో రెపో రేటును యథాతథంగా (5.15 శాతం) ఉంచింది. రివర్స్ రెపో రేటును కూడా మార్చకుండా 4.90 శాతం వద్దే ఉంచింది. వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచాలనే అంశంపై మానిటరీ పాలసీ కమిటీ 6-0 ఓట్లతో ఏకగ్రీవ నిర్ణయం తీసుకుంది.
2019-20 ఆర్థిక సంవత్సరంలో చివరి క్వార్టర్‌లో రిటైల్ ద్రవ్యోల్భణం 6.5 శాతంగా ఉంటుందని, 2020-21 ఆర్థిక సంవత్సరం తొలి అర్ధ భాగంలో 5.4 న నుండి 5 శాతంగా నమోదవుతుందని అంచనా వేసింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 6 శాతంగా ఉంటుందని అంచనా వేసింది. అక్టోబర్-డిసెంబర్ 2020లో ఇది 6.2 శాతంగా అంచనా వేసింది.

వృద్ధి రేటును పట్టాలెక్కించేందుకు వడ్డీ రేటు ఒక్కటే పరిష్కారం కాదని ఈ సందర్భంగా ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. వృద్ధిని పట్టాలెక్కించేందుకు ఆర్బీఐకి అనేక మార్గాలు ఉన్నాయని చెప్పారు.
2021-20 బడ్జెట్ తర్వాత జరిగిన తొలి ద్రవ్య, పరపతి విధాన సమీక్ష ఇది. గత డిసెంబర్ నెలలో కూరగాయల ధరలు భారీగా పెరిగాయి. దీంతో రిటైల్ ద్రవ్యోల్భణం అయిదేళ్ల గరిష్టానికి చేరుకుంది. ప్రస్తుత పరిస్థితులను బట్టి జూన్ సమీక్షలోను ఎలాంటి వడ్డీ రేట్ల కోత ఉండదని భావిస్తున్నారు. 2019లో ఆర్బీఐ మొత్తంగా 135 బేసిస్ పాయింట్ల మేర కీలక వడ్డీ రేట్లను తగ్గించింది.
More From GoodReturns

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications