Interest Rates: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI)కు చెందిన ద్రవ్య విధాన కమిటీ (MPC) ఏప్రిల్ 6న తీసుకున్న నిర్ణయం పలువురు ఆర్థికవేత్తలను ఆశ్చర్యపరిచింది. వరుసగా రెండు నెలల పాటు ద్రవ్యోల్బణం 6 శాతం మార్కు కంటే ఎక్కువగా ఉండటంతో మరోసారి 25 bps మేర వడ్డీరేట్ల పెంపు ఉంటుందని విశ్లేషకులు అంచనా వేశారు.
అయితే వారి ఊహాగానాలను తారుమారు చేస్తూ కేంద్ర బ్యాంకు తీసుకున్న నిర్ణయంపై మార్కెట్ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ముందస్తుగానే రేట్ల పెంపునకు చెక్ పెట్టడం సరికాదని అభిప్రాయపడుతున్నాయి.

సుదీర్ఘ కాలంపాటు ఎదుర్కొన్న ద్రవ్యోల్బణాన్ని ఇప్పుడిప్పుడే అధిగమిస్తున్నామని భావిస్తున్న తరుణంలో MPC నిర్ణయం వెల్లడైంది. అయితే సభ్యులందరూ తమలో తాము పలుమార్లు చర్చించిన పిమ్మటే దీనిని ఆమోదించారని గుర్తుంచుకోవాలి. మరో విషయం ఏమిటంటే, రేట్ల పెంపు గురించి RBI గవర్నర్ శక్తికాంత దాస్ ప్రకటిస్తున్న సమయంలో ఓ హెచ్చరికను సైతం చేసినట్లు గమనించాలి. ద్రవ్యోల్భణం పెరిగితే, భవిష్యత్తులో జరిగే సమావేశాల్లో రేట్లు పెంచాల్సి ఉంటుందన్నారు.
జనవరి, ఫిబ్రవరిలో సైతం RBI ముందుగా నిర్ణయించిన గరిష్ఠ స్థాయికి పైగా ద్రవ్యోల్బణం పెరిగిన వేళలోనూ.. MPC రేట్ల పెంపుపై అకస్మాత్తుగా యూటర్న్ తీసుకోవడం ప్రపంచ దేశాలను ఆశ్చర్యంలో ముంచెత్తింది. లోతుగా పరిశీలిస్తే, ఆర్థిక వృద్ధికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సెంట్రల్ బ్యాంకు భావించినట్లు అర్థమవుతోంది. లేనిపక్షంలో వడ్డీరేట్లపై ఇంత మొండిగా ముందుకు వెళ్లదని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు.
FY24లో ద్రవ్యోల్బణం సగటున 5.2 శాతంగా ఉంటుందని RBI అంచనా వేసింది. 6 శాతానికి దిగువన కట్టడి చేసేందుకు ఇప్పటికే సెంట్రల్ బ్యాంకు చర్యలు తీసుకుంది. కానీ ద్రవ్యోల్బణం విషయంలో ఊహించిన విధంగా జరగకపోతే మాత్రం MPC ప్యానెల్ మీద తీవ్ర ఒత్తిడి ఉంటుందనేది వాస్తవం. సాధారణం కంటే తక్కువ స్థాయిలో రుతుపవనాలు, ఎల్ నినో ముప్పు వంటి వార్తలు ఓ పక్క కలవరపెడుతూనే ఉన్నాయి. వీటిని ఎదుర్కోవడంలో ఇబ్బంది పడితే మరోసారి పెంపు తప్పదు, కానీ ఒకవేళ నిలబడగలిగితే భారీ ఆర్థిక వృద్ధిని ఆశించవచ్చు.
More From GoodReturns

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications