ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న అనిశ్చితి మధ్యలో కూడా భారతదేశపు మధ్యకాలిక ఆర్థిక దృశ్యం బలంగానే నిలబడుతుందనే నమ్మకాన్ని నోమురా సంస్థలో భారత ఆర్థిక వ్యవస్థను విశ్లేషించే ప్రముఖ ఆర్థికవేత్త ఆరోదీప్ నంది వ్యక్తం చేశారు. రూపాయి క్రమంగా బలపడే అవకాశం, స్థిరమైన ఆర్థిక వృద్ధి, అలాగే విధాన పరమైన సడలింపులు..ఇవన్నీ కలిసి భారత ఆర్థిక వ్యవస్థకు మద్దతునిస్తాయని ఆయన వివరించారు. ముఖ్యంగా అమెరికాతో భారతదేశం కుదుర్చుకోబోయే వాణిజ్య ఒప్పందం రూపాయి మారక విలువపై గణనీయమైన ప్రభావం చూపే అవకాశం ఉందని నంది విశ్వసిస్తున్నారు.
రూపాయి విలువపై తమ అంచనాలను వెల్లడిస్తూ..నోమురా డిసెంబర్ 2025 చివరి నాటికి రూపాయి డాలర్‌కు 88 స్థాయిలో ముగుస్తుందని పేర్కొంది. ఆపై 2026 మొదటి త్రైమాసికంలో 87.6 వరకు బలపడవచ్చని, 2026 చివరినాటికి 86.5 వరకు చేరుకునే అవకాశం ఉందని వారు అంచనా వేస్తున్నారు. ఈ అంచనాల అంతర్భాగంగా ఉన్న కీలక అంశం ఏంటంటే అమెరికా-భారత మధ్య వాణిజ్య ఒప్పందం. అక్కడ నిర్ణయించే తుది సుంకాలు అత్యంత ప్రభావవంతమైన అంశాలవుతాయి. సుంకాలు 15 నుంచి 20 శాతం మధ్యలో ఉంటే భారత్‌కు ప్రయోజనం కలిగిస్తుంది. కానీ సుంకాలు అధికంగా నిర్ణయిస్తే, భారత ఎగుమతిదారులు ఒత్తిడిని ఎదుర్కోవాల్సి వస్తుందని నంది హెచ్చరించారు.

ఇదిలా ఉండగా, అక్టోబర్ నెలలో భారత వాణిజ్య లోటు 41 బిలియన్ డాలర్లు దాటడం విశ్లేషకులను ఆశ్చర్యపరిచింది. ఇది అంచనాలను మించి ఉండగా.. US సుంకాల ప్రభావంతో బలహీనమైన ఎగుమతులు, అలాగే బంగారం సహా అనేక సరుకుల దిగుమతులు పెరగడం ఇతర కారణాలు అని నంది వివరించారు. ఈ నేపథ్యంలో నోమురా తాజా అంచనాల ప్రకారం.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి కరెంట్ అకౌంట్ లోటు GDPలో 1.2 శాతానికి స్వల్పంగా పెరుగుతుందని పేర్కొంది. అయినప్పటికీ, ఆర్థిక సంవత్సరం చివరి నెలల్లో వాణిజ్య లోటు సాధారణంగా తగ్గే ధోరణి ఉన్నందున, బాహ్య ఆర్థిక ఒత్తిడులు గణనీయంగా పెరిగే అవకాశం లేదని నంది చెప్పారు.
GDP వృద్ధి అంశంలో కూడా నోమురా ఆశాజనక దృక్పథాన్నే చూపిస్తోంది. జూలై-సెప్టెంబర్ త్రైమాసికానికి GDP వృద్ధి 7.6% ఉంటుందని అంచనా వేయగా, గత త్రైమాసికంలో నమోదైన 7.8 శాతంతో పోలిస్తే స్వల్ప తగ్గుదల కనిపించినప్పటికీ అది సహజమని నంది వివరించారు. తక్కువ ద్రవ్యోల్బణం ఆర్థిక వ్యవస్థకు అనుకూలంగా పనిచేస్తుందని, రాబోయే త్రైమాసికాల్లో వృద్ధిపై సానుకూల ప్రభావం చూపుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. నోమురా అంచనాల ప్రకారం, FY26లో GDP వృద్ధి 7 శాతం, FY27లో 6.6 శాతంగా ఉండే అవకాశం ఉంది. భారతదేశం-అమెరికా వాణిజ్య ఒప్పందం ఆర్థిక వ్యవస్థకు మరింత ఊతమిచ్చే అంశమని, అంతర్జాతీయ గందరగోళం తగ్గితే అది కూడా భారత ఆర్థిక వాతావరణానికి బలంగా మారుతుందని నంది పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో డిసెంబర్ నెలలో RBI వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం ఉందా? అనే ప్రశ్నపై ఆయన స్పందించారు. ఇది RBIకి చాలా సంక్లిష్టమైన నిర్ణయం అవుతుందని, అయితే నోమురా అంచనా ప్రకారం RBI మరో 50 బేసిస్ పాయింట్లు కోత విధించి రెపో రేటును 5 శాతం వరకు తగ్గించే అవకాశం ఉందని తెలిపారు. సమయంపై మాత్రం ఇంకా స్పష్టత లేకపోవడంతో అనిశ్చితి కొనసాగుతోందని ఆయన చెప్పారు. బలమైన GDP పరిమాణాలు, తగ్గుతున్న ద్రవ్యోల్బణం తక్షణ కోత అవసరాన్ని తగ్గించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం భారతదేశం చాలా క్లిష్టమైన దశలో ఉంది. ట్రంప్ సుంకాల ప్రభావం, GST కోతల ప్రభావం.. అన్నీ ఒకేసారి భారంగా మారుతున్నాయి. అయినప్పటికీ, నోమురా బేస్ కేస్ ఇప్పటికీ డిసెంబర్‌లో వడ్డీ రేటు కోతకే అనుకూలంగా ఉంది. కానీ ఆ నిర్ణయం RBIకి చాలా సవాలుతో కూడినదని నంది వ్యాఖ్యానించారు.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications