RBI Meet నిర్ణయంపై ఉత్కంఠ! రూపాయి వాల్యూ పెరుగుతుందా?
ఈ రోజు (డిసెంబర్ 5) భారతీయ రూపాయి అమెరికన్ డాలర్‌తో పోలిస్తే బలంగా ట్రేడింగ్ ప్రారంభించింది. నిన్నటి ముగింపు ధర 89.98 వద్ద ఉండగా.. ఈ రోజు 89.85 వద్ద ప్రారంభమై 13 పైసలు లాభపడింది. దీనికి ప్రధాన కారణం.. దేశీయ మార్కెట్ దృష్టి అంతా ఈ రోజు జరగనున్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) పాలసీ కమిటీ మీటింగ్. ఉండటమే. ఈ RBI Meetలో ఎలాంటి నిర్ణయాలు వస్తాయని అంతటా ఉత్కంఠ నెలకొంది.

రెపో రేటు కోత
గత రెండు నెలలుగా సీపీఐ ఇన్‌ఫ్లేషన్ (CPI Inflation) అత్యంత కనిష్ట స్థాయికి చేరుకోవడంతో.. RBI రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేశారు. అయితే ఈ రేటు కోత రూపాయిపై ఎలాంటి ప్రభావం చూపుతుందనేది కీలక ప్రశ్న. రూపాయి ఇప్పటికే ఒత్తిడిలో ఉన్న నేపథ్యంలో.. రేటు కోత వడ్డీ రేటు వ్యత్యాసాన్ని మరింత పెంచుతుంది. ఇది విదేశీ నిధుల అవుట్ ఫ్లోని ప్రవాహాన్ని పెంచి, రూపాయి పతనాన్ని వేగవంతం చేసే ప్రమాదం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అందుకే చాలామంది ఆర్థికవేత్తలు రేటు కోత ఉండదని భావిస్తున్నారు.
రూపాయి రికార్డు కనిష్టం.. ఆదుకున్న RBI జోక్యం!
నిన్న డిసెంబర్ 4న.. రూపాయి అమెరికన్ డాలర్‌తో పోలిస్తే 90 మార్కు కంటే దిగువకు పడిపోయి, ఒకానొక దశలో 90.42 వద్ద రికార్డు కనిష్టాన్ని తాకింది. అయితే, RBI జోక్యం చేసుకునే అవకాశం ఉండటం, అలాగే కొంతమంది ఎగుమతిదారులు డాలర్లను విక్రయించడం వల్ల రూపాయి కోలుకుంది. ఐఎఫ్‌ఏ గ్లోబల్ (IFA Global) వ్యవస్థాపకుడు అభిషేక్ గోయెంకా అంచనా ప్రకారం.. రూపాయి 89.80 - 90.20 మధ్య ట్రేడ్ అవుతుందని భావిస్తున్నారు. రూపాయి ఇంత బలంగా పడిపోవడం ద్వారా విదేశీ పెట్టుబడిదారులను తిరిగి భారతీయ ఆస్తుల వైపు ఆకర్షించే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో.. నేటి RBI Meet తర్వాత RBI గవర్నర్ చేసే వ్యాఖ్యలు మార్కెట్‌కు దిశానిర్దేశం చేస్తాయని అందరూ ఎదురుచూస్తున్నారు.
గమనించాల్సిన అంశాలు
నేటి RBI Meet నుండి కేవలం రెపో రేటు నిర్ణయం మాత్రమే కాకుండా.. రూపాయి ఇటీవలి పతనం గురించి RBI గవర్నర్ ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తం చేస్తారు? అలాగే ఎన్నారైల నుండి మూలధన ప్రవాహాన్ని (Capital Inflows) ఆకర్షించడానికి ఏదైనా కొత్త చర్యలు ప్రకటిస్తారా? అనే దానిపై మార్కెట్ ప్రత్యేక దృష్టి సారించింది.
మొత్తగా ఈ రోజు మార్కెట్ పూర్తిగా RBI Meet నిర్ణయాలపై ఆధారపడి ఉంటుంది. ఇన్వెస్టర్లు అధికారిక ప్రకటనల కోసం వేచి ఉండడం మంచిది. అలాగే మార్కెట్ ఎలా స్పందిస్తుందో తెలుసుకుని పెట్టుబడులుపెట్టడం ఉత్తమం.


Click it and Unblock the Notifications