రివర్స్ రెపో రేటు పెరిగే ఛాన్స్.. రెపో మాత్రం సేమ్.. వడ్డీరేట్లు పెంచాల్సిందే..?: ఆర్థికవేత్తలు
రెపో రేటులో ఏ మార్పు ఉండబోదని తెలుస్తోంది. ఆర్బీఐ రెపో రేటు స్థిరత్వంగా ఉంచాలని భావిస్తోందని విశ్లేషకులు అంచనా వేశారు. అయితే మహమ్మరి వల్ల లిక్విడిటీని తగ్గించాలని ఆర్బీఐ అనుకుంటుంది. రివర్స్ రెపో రేటు మాత్రం పెంచాలని భావిస్తోందని ఆర్థిక శాస్త్రవేత్తలు లెక్కలు వేస్తున్నారు.
ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ మంగళవారం నుంచి గురువారం వరకు జరగనుంది. వాస్తవానికి 7వ తేదీన ప్రారంభం కావాల్సి ఉంది. కానీ ప్రముఖ నేపథ్య గాయనీ లతా మంగేష్కర మరణంతో మహారాష్ట్ర ప్రభుత్వం రెండురోజులు సంతాప దినాలుగా ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో మంగళవారం నుంచి సమావేశాలు ప్రారంభం అవుతున్నాయి.

రివర్స్ రెపోరేటును 3.35 శాతం నుంచి 3.55 శాతానికి సెంట్రల్ బ్యాంక్ స్వల్పంగా పెంచనుందని రాయిటర్స్ తన కథనంలో పేర్కొంది. దీంతో రెపో రేటు మధ్య అంతరం 45 బేసిక్ పాయింట్లు తగ్గిస్తోంది. ఏప్రిల్‌లో జరిగే తదుపరి సమావేశంలో రెపో రేటు 25 బీపీఎస్ పెరుగుతుందని అంచనా వేసింది. ఆర్బీఐ ఈ ఏడాది వడ్డీరేట్లను పెంచాల్సిన అవసరం ఉందని ఈక్విటీ స్ట్రాటజీ గ్లోబల్ హెడ్ క్రిస్టోపర్ అభిప్రాయపడ్డారు.
ఆర్బీఐ వద్ద బ్యాంకులు రుణం తీసుకుంటాయి. వాణిజ్య బ్యాంకులు ఆర్బీఐ వద్ద రుణం తీసుకున్న సమయంలో వసూల్ చేసే దానిని రేపో రేటు అంటారు. దీనిని స్వల్పకాలిక వడ్డీ రేటు అని కూడా పిలుస్తారు. బ్యాంకులు తమ వద్ద డబ్బు ఎక్కువగా ఉందనుకుంటే దానిని రిజర్వ్ బ్యాంక్ రుణం ఇవ్వొచ్చు.. వాణిజ్య బ్యాంకుల వద్ద రుణాలుగా తీసుకున్న మొత్తానికి ఆర్బీఐ చెల్లించే వడ్డీనే రివర్స్ రెపో రేటు అంటారు. ఇదీ రెపో రేటు కన్నా తక్కువగా ఉంటుంది. కానీ ఇప్పుడు రెపో రేటు అలానే ఉంచి.. రివర్స్ రెపో రేటు పెంచాలని ఆర్థిక వేత్తలు సూచిస్తున్నారు.


Click it and Unblock the Notifications