ప్రయివేటురంగ దిగ్గజం HDFC బ్యాంకు సీఈవో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) వడ్డీ రేట్ల పెంపుపై స్పందించారు. ఈ ఏడాది రెపో రేటు రెండు లేదా మూడుసార్లు తప్పక పెరిగే అవకాశాలు ఉన్నాయని HDFC వైస్ చైర్మన్, సీఈవో కేకీ మిస్త్రీ అంచనా వేశారు. వచ్చే ద్ర్య సమీక్షలో ఆర్బీఐ కీలక వడ్డీ రేట్లను పెంచుతుందని అభిప్రాయపడ్డారు. వడ్డీ రేటు విషయంలో ఆర్బీఐ తీరును తప్పుబట్టలేమన్నారు.
వాస్తవానికి ఉపాధి కల్పన, ప్రజల ఆదాయం పెరుగుదలకు, వినియోగ సామర్థ్యం పుంజుకోవడానికి ఆర్థిక వ్యవస్థలో ప్రగతి అనేది దేశానికి చాలా ముఖ్యమని చెప్పారు. ఈ క్రమంలో వడ్డీరేట్లు పెరగడం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావమేమీ ఉండదని చెప్పారు. ద్రవ్యోల్బణం విషయంలో భారత్-అమెరికా మధ్య పోలిక వద్దని చెప్పారు. అమెరికాలో ఎప్పుడు ద్రవ్యోల్బణం ఎక్కువేనని, భారత్‌లో తక్కువే అన్నారు. అమెరికాలో 8.5 శాతానికి పైగా ఉంటే, భారత్‌లో 5.7 శాతం వద్దే ఉందని చెప్పారు.

ఆర్థిక పునరుద్ధరణకు ముందు వడ్డీ రేట్లను పెంచడం వృద్ధిని దెబ్బతీస్తుందని ఆర్బీఐకీ తెలుసునని చెప్పారు. తన నలభై ఏళ్ల అనుభవంలో హౌసింగ్ లోన్స్ పైన వడ్డీ రేట్లు ఈ స్థాయికి తగ్గడం చూడలేదన్నారు. ఇప్పటికిప్పుడు వడ్డీ రేట్లు పెరగకపోయినప్పటికీ 2022లో మాత్రం వడ్డీ రేట్లను మూడుసార్లు పెంచవచ్చునని చెప్పారు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications