ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) వడ్డీరేట్లను వరుసగా 3వసారి యథాతథంగా ఉంచే అవకాశాలు ఉన్నాయని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) అంచనా వేస్తోంది. అక్టోబర్ నెలలో రిటైల్ ద్రవ్యోల్భణం 7 శాతానికి పైగా నమోదయింది. సెప్టెంబర్ నెలలోను ఏడు శాతం కంటే పెరిగింది. కూరగాయల ధరలు కూడా పెరుగుతున్నాయి. దీంతో ఆర్బీఐ వడ్డీ రేట్ల జోలికి వెళ్లకపోవచ్చుని ఎస్బీఐ చైర్మన్ దినేష్ కుమార్ ఖారా అన్నారు. డిసెంబర్ 2వ తేదీ నుండి 4వ తేదీ వరకు ఆర్బీఐ పరపతి సమీక్ష ఉంటుంది. ఆర్బీఐ ద్రవ్యోల్భణం లక్ష్యం 4 శాతం కాగా, వరుసగా రెండో నెల 7 శాతంగా నమోదయింది.

రిటైల్ ద్రవ్యోల్భణం ఎఫెక్ట్
సరఫరా వ్యవస్థలో ఎదురవుతున్న సమస్యల కారణంగా ధరల సూచీ వరుసగా రెండో నెల 7 శాతానికి పైగా నమోదు చేసిందని, దీంతో ఆర్బీఐ కీలక వడ్డీరేట్లను తగ్గించకపోచ్చని ఖారా అభిప్రాయపడ్డారు. వచ్చే శుక్రవారం ఆర్బీఐ ద్రవ్య విధాంలో రెపోరేటు విషయంలో యథాతథస్థితిని కొనసాగించే ఆస్కారం ఉందని ఆర్థిక నిపుణులు కూడా భావిస్తున్నారు. దేశంలో రిటైల్ ద్రవ్యోల్భణం గరిష్టస్థాయిలో ఉండటమే ఇందుకు కారణమని వారు కూడా అభిప్రాయపడుతున్నారు.

వరుసగా మూడోసారి
అక్టోబరు ఎంపీసీ సమావేశంలో సర్దుబాటు ధోరణిని కొనసాగిస్తూ రెపోరేట్లను యథాతథంగా కొనసాగించింది ఆర్బీఐ. ఈసారి అదే వైఖరి కొనసాగిస్తే వరుసగా మూడోసారి ఆ తరహా నిర్ణయం అవుతుంది. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి రెపోరేట్లను 1.15 శాతం మేరకు తగ్గించిన ఆర్బీఐ గత రెండు విడతలుగా తగ్గింపు నిర్ణయాన్ని పక్కన పెట్టింది. ఆహార వస్తువుల ధరల కారణంగా వినియోగదారుల సూచి ఆధారిత ద్రవ్యోల్బణం వరుసగా 9 నెలలుగా పెరుగుతూ వస్తోంది. అక్టోబర్ నెలలో 7.61 శాతంగా నమోదయింది. 2014 మే తర్వాత ఇది గరిష్ఠం.

వడ్డీ రేట్లు తగ్గకపోవచ్చు
ప్రస్తుతం ద్రవ్యోల్బణం ఆరు శాతం కంటే ఎక్కువగా కదలాడుతోందని, దీంతో వడ్డీ రేట్లు తగ్గించకపోవచ్చునని కొటక్ మహీంద్రా బ్యాంకు ప్రెసిడెంట్ అన్నారు. అయితే కార్యకలాపాలు పుంజుకోవడం, వినియోగ డిమాండ్ సాధారణ స్థితికి చేరుకోవడం ఆశాజనకంగా ఉందని, కానీ ఇది నిలబడుతుందా లేదా అనేది కీలకమని చెబుతున్నారు. వాస్తవ వడ్డీ రేట్లు ఇప్పటికే ప్రతికూలంగా మారాయని, కాబట్టి మరింత తగ్గింపు ఉండకపోవచ్చునని చెబుతున్నారు.

ఆర్బీఐ వైపు చూపు
కార్యకలాపాలు పుంజుకుంటుండటంతో ఇన్వెస్టర్లు ఆర్బీఐ వడ్డీ రేట్లు సహా ఇతర నిర్ణయాలపై దృష్టి సారించారు. పరపతి సమీక్ష నిర్ణయాలు, ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ చెప్పేది కీలకం కానుంది. జీడపీ గణాంకాల ప్రభావం కూడా ఇన్వెస్టర్లపై ప్రభావం చూపుతాయి.


Click it and Unblock the Notifications