కేంద్రబ్యాంకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) వడ్డీ రేటును ఈసారి కూడా స్థిరంగా కొనసాగించవచ్చునని ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రభావం నేపథ్యంలో రెపో రేటు స్థిరంగా కొనసాగించినప్పటికీ, రివర్స్ రెపో రేటును పెంచవచ్చునని భావిస్తున్నారు. డిసెంబర్ 8న ఆర్బీఐ మానిటరీ పాలసీ సమావేశం ఉండనుంది. ప్రస్తుతం రెపో రేటు 4 శాతంగా ఉంది.
యావత్ ప్రపంచం ఒమిక్రాన్ భయాలతో గడగడలాడుతోంది. ఈ నేపథ్యంలో ఆర్బీఐ ద్రవ్యపరపతి సమావేశం ప్రారంభమైంది. ప్రస్తుత పరిస్థితుల్లో ద్రవ్యోల్బణ కట్టడి లక్ష్యాన్ని అతిక్రమించకుండానే వృద్ధికి ఊతం ఇచ్చే లక్ష్యంతో ఆర్బీఐ వడ్డీరేట్ల విషయంలో వేచిచూసే ధోరణి అనుసరించవచ్చునని ఆర్థిక విశ్లేషకులు భావిస్తున్నారు. అదే జరిగితే ఆర్బీఐ కీలక రేట్ల విషయంలో యథాతథ స్థితిని కొనసాగించడం ఇది వరుసగా తొమ్మిదోసారి అవుతుంది.

2020 మే 22న ఆర్బీఐ చివరిసారి రెపోరేట్లను సవరించింది. అప్పటి నుండి వడ్డీ రేట్లు చారిత్రక కనిష్ఠస్థాయిలో ఉన్నాయి. దేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం నాలుగు శాతానికి కట్టడి చేయాలని ఆర్బీఐ భావిస్తోంది. రిస్క్‌లన్నీ సమతూకంగా ఉన్న కారణంగా 2021-22లో కన్స్యూమర్ సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం 5.3 శాతంగా ఉండవచ్చునని అక్టోబర్ సమీక్షలో ఆర్బీఐ అంచనా వేసింది. 2022-23 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో 5.2 శాతం ఉండవచ్చునని భావిస్తోంది.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!



Click it and Unblock the Notifications