మాస్టర్ కార్డుకు ఊరట, ఏడాది తర్వాత ఆర్బీఐ నియంత్రణ ఎత్తివేత

భారత కేంద్ర బ్యాంకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మాస్టర్ కార్డు పైన ఆంక్షలను ఎత్తివేసింది. అమెరికా ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న డెబిట్/క్రెడిట్ కార్డ్స్ నెట్ వర్కింగ్ సంస్థ మాస్టర్ కార్డు పైన నియంత్రణలను తొలగిస్తున్నట్లు ఆర్బీఐ గురువారం ప్రకటించింది. లోకల్ డేటా స్టోరేజ్ నిబంధనలను పాటించడం లేదనే ఆరోపణలపై కొత్త కస్టమర్లను చేర్చుకోవడంపై ఆర్బీఐ గత ఏడాది నిషేధం విధించింది.

ఇప్పుడు పేమెంట్ సిస్టమ్ డేటా నిబంధనల పాటింపుపై సంతృప్తి వ్యక్తం చేయడంతో మాస్టర్ కార్డ్ ఆసియా/పసిఫిక్‌పై నియంత్రణలను ఎత్తివేస్తున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. మాస్టర్ కార్డుపై ఆర్బీఐ ఆంక్షలు విధించి దాదాపు ఏడాది అవుతోంది. 2021 జూలై 22వ తేదీ నుండి కొత్త కస్టమర్లను చేర్చుకోకుండా ఆదేశాలు జారీ చేసింది. ఇప్పుడు దానిని తొలగించింది.

RBI lifts restrictions on Mastercard, allows onboarding of customers

పేమెంట్స్‌కు సంబంధించి డేటాను దేశీయంగా భద్రపరచాలని 2018 ఏప్రిల్ 6వ తేదీన ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు 6 నెలల గడువును ఇచ్చింది. గడువు పూర్తైనా నిబంధనలు పాటించడంలో మాస్టర్ కార్డు విఫలమైంది. దీంతో పేమెంట్స్ అండ్ సెటిల్మెంట్స్ సిస్టమ్స్ చట్టం 2007ను అనుసరించి గత ఏడాది చర్యలు తీసుకుంది. ఇప్పుడు డేటా నిబంధనల పాటింపుపై సంతృప్తి వ్యక్తం చేసి, ఆంక్షలను తొలగించింది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+