Gold News: తక్కువ ధరకే స్వచ్ఛమైన మేలిమి బంగారం. అది కూడా భారతీయ రిజర్వు బ్యాంక్ అందిస్తున్న సదవకాశం. అవును సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ మరోసారి ఐదు రోజుల పాటు ప్రజల ముందుకు వచ్చేస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

గోల్డ్ బాండ్స్..
కష్టకాలంలో సురక్షితమైన పెట్టుబడి ఎంపిక అనగానే మనందరికీ గుర్తుకువచ్చేది బంగారం. అందుకే ద్రవ్యోల్బణ సమయంలో రిజర్వు బ్యాంక్ పెట్టుబడిదారులకు ఒక సదవకాశాన్ని అందుబాటులోకి తెస్తోంది. ప్రస్తుత సంవత్సరం 2022-23లో సిరీస్ IIIని ప్రజల ముందుకు తీసుకొస్తోంది. ఇది ఐదు రోజుల పాటు అంటే డిసెంబర్ 19 నుంచి 23 వరకు అందుబాటులో ఉండనుంది. దీనికి సంబంధించిన డిజిటల్ బాండ్లను కంపెనీ డిసెంబర్ 27న జారీ చేయనున్నట్లు తెలుస్తోంది.

భద్రతతో పాటు రాయితీలు..
గోల్డ్ బాండ్స్ ద్వారా వడ్డీ రేటు, పన్ను రాయితీ, భద్రత, డిజిటల్ ఫార్మాట్ వంటి ప్రయోజనాలు ఉన్నాయి. పైగా అత్యవసర సమయంలో బంగారాన్ని తాకట్టు పెట్టినట్లుగా దీనిని సైతం తాకట్టు పెట్టి రుణాన్ని తీసుకునేందుకు వెసులుబాటు కూడా ఉంటుంది. RBI జారీ చేసే సావరిన్ గోల్డ్ బాండ్స్ డిజిటల్ రూపంలో కొనుగోలు విక్రయం చేయవచ్చు.

బాండ్ ధర..
ఇష్యూకి ముందు మూడు రోజుల పాటు ఇండియన్ బులియన్ అండ్ జువెలరీ అసోసియేషన్ లిమిటెడ్ ద్వారా నిర్ణయించబడిన ధరకు సగటును బాండ్ ధరగా నిర్ణయించటం జరుగుతుంది. పైగా ఆన్‌లైన్ కొనుగోలుదారులకు గ్రాముపై రూ.50 తగ్గింపు కూడా ఉంది. ఎవరైనా వ్యక్తి ఒక్క గ్రాము నుంచి గరిష్ఠంగా 4 కేజీల వరకు బంగారాన్ని బాండ్స్ రూపంలో కొనుగోలు చేయవచ్చు. అదే ట్రస్టులు గరిష్ఠంగా ఏడాదికి 20 కేజీల వరకు కొనుగోలు చేయవచ్చని తెలుస్తోంది. వీటిని బ్యాంకులు, పోస్టాఫీసులు, స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.

వడ్డీ ప్రయోజనం..
గోల్డ్ బాండ్లను కొనుగోలు చేయటం వల్ల వచ్చే అధనపు ప్రయోజనాల్లో వడ్డీ కూడా ఒకటి. బాండ్లను కొన్న ఇన్వెస్టర్లు ఏడాదికి తమ పెట్టుబడిపై 2.5% వడ్డీ రేటును పొందుతారు. అయితే వడ్డీ మీ ఆదాయానికి జోడించబడుతుంది. మీరు దానిపై ఆదాయపు పన్ను చెల్లించాలి.. కానీ వడ్డీ ఆదాయంపై ఎలాంటి టీడీఎస్ విధించబడదు. స్టాక్ ఎక్స్ఛేంజీలో వీటిని ట్రేడ్ చేయటానికి ఇన్వెస్టర్ డీమ్యాట్ ఖాతాను తప్పక కలిగి ఉండాల్సి ఉంటుంది.

పెట్టుబడి మెచూరిటీ వివరాలు..
గోల్డ్ బాండ్ స్కీమ్ 8 ఏళ్ల మెచ్యూరిటీని కలిగి ఉంటుంది. అయితే 5 సంవత్సరాల తర్వాత బాండ్లను విక్రయించుకునే వెసులుబాటు కూడా ఉంది. ఎవరైనా ఇన్వెస్టర్ 8 ఏళ్ల పాటు పెట్టుబడిని కొనసాగిస్తే.. వారికి విక్రయించినప్పుడు ఉండే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ టాక్స్ విధించబడదు. ఇది కాకుండా మధ్యలోనే నిష్క్రమిస్తే మాత్రం ఆర్జించిన లాభాలపై పన్ను తప్పక చెల్లించాల్సి ఉంటుంది. ఫిజికల్ బంగారానికి డిమాండ్ తగ్గించేందుకు తీసుకొచ్చిన ఈ పథకానికి ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది.

తరువాతి సిరీస్..
బంగారం ధరలు పెరుగుతున్న తరుణంలో గణనీయమైన ఆదాయం పొందటానికి, కుమార్తె వివాహం కోసం ప్లాన్ చేసుకునే వారికి ఈ స్కీమ్ సరైన ఎంపిక అని చెప్పుకోవచ్చు. అందుకే దీని తరువాతి సిరీస్ గోల్డ్ బాండ్స్ విక్రయాుల 2023 మర్చి 6 నుంచి 10 మధ్య జరుగుతాయని తెలుస్తోంది. ఇన్ని ప్రయోజనాలు ఉన్న ప్రభుత్వ పెట్టుబడి పథకాన్ని ప్రజలు తప్పక వినియోగించుకోవాలని రిజర్వు బ్యాంక్ సూచిస్తోంది.
More From GoodReturns

భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంతకు చేరిందంటే.. ఏప్రిల్ 1, బుధవారం ధరలు ఇవే..

బంగారం, వెండి పెట్టుబడిదారులకు బిగ్ అలర్ట్.. సెబీ కొత్త నియమాలు తెలుసుకుని కొనుగోలుకు వెళ్లండి..

Today Gold Silver Rate Live: కుప్పకూలిన బంగారం, వెండి ధరలు..కొంపలు ముంచుతున్న ట్రంప్ నిర్ణయాలు

బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాలంటే రూపాయి బలపడాల్సిందే.. ఆర్థిక నిపుణులు ఏమంటున్నారంటే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

ఇరాన్ యుద్దం దెబ్బ.. బంగారం కొనడం మానేసి అమ్మేసుకుంటున్న కేంద్ర బ్యాంకులు.. కారణం ఏంటంటే..

బంగారం, వెండి ధరలు ఈ వారం ఎలా ఉండబోతున్నాయి..వరుస సెలవులు కాపాడుతాయా..కొంపలు ముంచుతాయా..

బంగారం ధరలు పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంతకు చేరిందంటే.. మార్చి 31, మంగళవారం ధరలు ఇవే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Gold: గోల్డ్ లవర్స్‌కు గుడ్ న్యూస్! భారీ పతనం తర్వాత కోలుకుంటున్న పసిడి.. నిపుణుల అంచనా ఇదే.!



Click it and Unblock the Notifications