Paytm News: పేటీఎం ఆదాయానికి గండి.. RBI నిర్ణయంతో ఇన్వెస్టర్లలో అలజడి.. నేడు..
RBI ban Paytm: దేశంలోని అతిపెద్ద ఫిన్‌టెక్ స్టార్టప్ పేటీఎం ఆర్బీఐ నుంచి పెద్ద షాక్ ఎదుర్కొంటోంది. ఇది రానున్న కాలంలో కంపెనీ ఆదాయాలపై తీవ్రంగా ప్రభావాన్ని చూపుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
మార్చి 1, 2024 నుంచి పేటీఎం తన బ్యాంకింగ్ వ్యాపారాన్ని నిలిపివేయాలని, ఈ లోపు కొత్త కస్టమర్ల ఆన్ బోర్డింగ్ పూర్తిగా ఆపేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జనవరి 31న ప్రకటించింది. అయితే ఈ నిర్ణయం వల్ల పేటీఎం Ebitda దాదాపు రూ.300 నుంచి రూ.500 కోట్ల వరకు ప్రభావితం అవుతుందని తెలుస్తోంది. ఇటీవల త్రైమాసికాల్లో నష్టాలను తగ్గించుకుండా లాభాలవైపు అడుగులు వేస్తున్న పేటీఎంకు ఇది పెద్ద అవరోధం అని చెప్పుకోవచ్చు.

ఈ క్రమంలో పేటీఎం మాతృసంస్థ One97 కమ్యూనికేషన్స్ స్టాక్ ఎక్స్ఛేంజీ ఫైలింగ్స్ ప్రకారం.. కంపెనీ తన సేవలను అందించడం కొనసాగించగలదని నిర్ధారించుకోవడానికి పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ నుండి చాలా వ్యాపార సంబంధాలను తరలించే ప్రక్రియలో ఉన్నట్లు వెల్లడించింది. అయితే ఈ విషయంలో ముందుకు వెళ్లేందుకు కంపెనీ ఇతర బ్యాంకులతో కలిసి పనిచేస్తున్నట్లు వెల్లడించింది. లాభదాయకమైన మర్చంట్ పేమెంట్ సేవలను ఇతర బ్యాంకుల భాగస్వామ్యంతో కొనసాగిస్తామని వెల్లడించింది.
ఇదే సమయంలో ఫిన్‌టెక్ కంపెనీకి చెందిన పేటీఎం QR, పేటీఎం సౌండ్‌బాక్స్, పేటీఎం కార్డ్ మెషిన్ వంటి ఆఫ్‌లైన్ వ్యాపారి చెల్లింపు నెట్‌వర్క్ ఆఫర్‌లు యథావిధిగా కొనసాగుతాయని, వీటిలో కొత్త వ్యాపారుల ఆన్‌బోర్డ్ కొనసాగుతుందని స్పష్టం చేసింది. పేటీఎం మార్చి 2022లో తన ఆన్‌లైన్ చెల్లింపు గేట్‌వే వ్యాపారం కోసం కొత్త వ్యాపారులను ఆన్‌బోర్డ్ చేసే సామర్థ్యాన్ని కోల్పోయింది. ప్రస్తుతం దాని చెల్లింపు అగ్రిగేటర్ లైసెన్స్ RBI వద్ద పెండింగ్‌లో ఉంది.
ఇదే సమయంలో పేటీఎం రుణ వితరణ, అసెట్ మ్యానేజ్మెంట్ కార్యకలాపాలను కొనసాగిస్తుందని కంపెనీ వెల్లడించింది. అయితే ప్రస్తుతం పేటీఎం బ్రాండ్‌పై వచ్చిన రెగ్యులేటరీ హిట్‌ను బట్టి కంపెనీపై కస్టమర్ల విశ్వాసం భారీగా దెబ్బతినే అవకాశం ఉందని పరిశ్రమలోని వ్యక్తులు చెబుతున్నారు. ఈ ప్రభావం నేడు స్టాక్ మార్కెట్లలో పేటీఎం షేర్లపై ప్రతికూలంగా ఉండే ప్రమాదం ఉందని వారు అంటున్నారు. దీంతో కంపెనీ షేర్ హోల్డర్లలో కొత్త ఆందోళనలు నెలకొన్నాయి.


Click it and Unblock the Notifications