SGBs: పెరుగుతూ పోతున్న బంగారం ధరలు సామాన్యుడికి షాక్ ఇస్తున్నాయి. ఈనెలలో గ్రాము ధర 6 వేల మార్కును కూడా దాటేసింది. అయితే బంగారం భౌతికంగా గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేసేవారు కొందరైతే, మరికొందరు సావరిన్ గోల్డ్ బాండ్స్ ద్వారా పెట్టుబడి పెడుతుంటారు. కాగా వాటి గురించి ఇప్పుడు కీలక ప్రకటన వెలువడింది.
సావరిన్ గోల్డ్ బాండ్స్(SGB)ను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్వహిస్తూ ఉంటుంది. కాగా ఈ పథకం 2016-II సిరీస్ కోసం రిడెంప్షన్ డేట్ మరియు ధరను RBI ప్రకటించింది. యూనిట్‌కు 6 వేల 601గా నిర్ణయించింది. మార్చి 18 నుంచి 22 వారానికి సంబంధించిన బంగారం ముగింపు ధర సగటను ప్రామాణికంగా తీసుకుంది. ఈ మేరకు ఓ నోటిఫికేషన్ జారీ చేసింది. మార్చి 28, 2024ను తుది తేదీగా పేర్కొంది.

'SGB రిడెంప్షన్ ధర సదరు తేదీకి ముందు వారంలో 999 స్వచ్ఛతతో కూడిన బంగారానికి సంబంధించిన సాధారణ సగటు ధరపై ఆధారపడి ఉంటుంది. ఇండియా బులియన్ అండ్ జువెలర్స్ అసోసియేషన్ లిమిటెడ్ (IBJA) ప్రకారం మార్చి 28, 2024(మార్చి 29, 2024 సెలవుదినం) నాటికి యూనిట్ ధర 6,601' అని RBI వెల్లడించింది.
SGB కింద అప్పట్లో గ్రాము బంగారం 2 వేల 916కి కొనుగోలు చేయబడం విశేషం. ప్రస్తుత ధరతో పోలిస్తే ఇష్యూ ధర సగం కంటే తక్కువగా ఉంది. ఉదాహరణకు 2016లో ఎవరైనా ఒక లక్షా 2 వేల 60 వెచ్చించి 35 గ్రాముల బంగారాన్ని SGB ద్వారా కొని ఉంటే అది కాస్తా ఇప్పుడు 2 లక్షల 31 వేల 35 అవుతుంది.
వడ్డీని పక్కనపెడితే ఓ వ్యక్తి SGBపై సంపాదించిన మొత్తం 126.37 శాతంగా డేటా చెబుతోంది. CAGR (కంపౌండెడ్ వార్షిక వృద్ధి రేటు) పరంగా రాబడులు 10.75 శాతం మేర పెరిగాయి. అయితే ఓ వ్యక్తికి 4 కిలోల వరకు మాత్రమే ఇన్వెస్ట్ చేసేందుకు పరిమితం విధించారు. కనీసం 1 గ్రాము పెట్టుబడిగా పెట్టాల్సి ఉంటుంది.


Click it and Unblock the Notifications