RBI News: భారతీయ రిజర్వ్ బ్యాంక్ ద్రవ్య విధాన కమిటీ సమావేశం తర్వాత అందరూ ఊహించిన విధంగానే వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు చేయటం లేదని గవర్నర్ శక్తికాంత దాస్ ప్రకటించారు.
సమావేశంలో తీసుకున్న నిర్ణయాల గురించి ప్రకటించారు. ఈ క్రమంలో లోన్ EMIలపై ప్రత్యక్ష ప్రభావం చూపే పాలసీ రేట్లపై ఎక్కువ దృష్టి పెట్టారు. కస్టమర్లు చెల్లించే రుణాల విషయంలో ఎలాంటి మార్పులు ఉండబోవని వెల్లడైంది. ఈ సమావేశంలో ఎంపీసీ కమిటీ కీలక రెపో రేటును 6.5% వద్ద యథాతథంగా కొనసాగించాలని ఏకగ్రీవంగా నిర్ణయించింది. దీంతో వరుసగా నాలుగో సారి వడ్డీ రేట్లను రిజర్వు బ్యాంక్ ఎలాంటి మార్పులు లేకుండా కొనసాగిస్తున్నట్లు వెల్లడించింది.

దీనికి ముందు మే 2022- ఫిబ్రవరి 2023 మధ్య కాలంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని అదుపుచేసేందుకు రిజర్వు బ్యాంక్ రెపో రేటును వరుసగా 6 సార్లు పెంచింది. మే సమావేశంలో 4 శాతం నుంచి 4.90 శాతానికి పెంచబడింది. అలా చివరిసారి 2023 ఫిబ్రవరిలో 6.25 శాతం నుంచి 6.50 శాతానికి కీలక వడ్డీ రేట్లను సవరించటం జరిగింది. అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థల అంచనా ప్రకారం వచ్చే ఏడాది తొలి త్రైమాసికంలో రేట్ల తగ్గింపుకు రిజర్వు బ్యాంక్ వెళ్లొచ్చని వెల్లడైంది.
సెంట్రల్ బ్యాంక్ 2024 ఆర్థిక సంవత్సరానికి GDP వృద్ధిని 6.5 శాతంగా అంచనా వేసింది. కానీ ఉపాంత ద్రవ్యోల్బణం రేటు 5.1 శాతం నుంచి 5.4 శాతానికి సవరించబడింది. ఇదే క్రమంలో UPI లైట్ ద్వారా నగదు లావాదేవీ పరిమితిని రూ.200 నుంచి రూ.500కి పెంచుతున్నట్లు స్పష్టం చేసింది. రెపో రేటు అనేది రిజర్వు బ్యాంక్ దేశంలోని ఇతర బ్యాంకులకు రుణాలను ఇచ్చే రేటు. దీని కారణంగా సామాన్యులకు లభించే రుణాలు చాలా ఖరీదుగా మారాయి. అప్పుల ఖర్చు ఆర్థిక వ్యవస్థలో నగదు ప్రవాహాన్ని తగ్గించింది. తాజాగా రేట్లను స్థిరంగా కొనసాగించటంపై దేశీయ స్టాక్ మార్కెట్లు సైతం మంచి లాభాల్ల కొనసాగుతున్నాయి.


Click it and Unblock the Notifications