RBI: శుభవార్త చెప్పిన ఆర్బీఐ.. యథాతధంగా రెపో రేటు..

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రుణ గ్రహీతలకు శుభవార్త చెప్పింది. ఈసారి ఎలాంటి రెపో రేటు పెంపు లేదని ప్రకటించింది. నిజానికి ఈసారి 25 బేసిస్ పాయింట్లు పెంచుతారని భావించారు. కానీ ఆర్బీఐ రెపో రేటును యథాతధంగా ఉంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో హోం లోన్, పర్సనల్ లోన్ గ్రహీతలతో పాటు ఇతర రుణా గ్రహీతలు ఊపిరిపీల్చుకున్నారు.

ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాలను ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ గురువారం వెల్లడించారు. రెపో రేటు యథాతధంగా ఉంచాలనే నిర్ణయాన్ని మానిటరీ పాలసీ కమిటీ లోని ఆరుగురు సభ్యుల్లో ఐదుగురు సమర్థించినట్లు వివరించారు. పెరిగిన ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు ఆర్బీఐ గత ఆర్థిక సంవత్సరం నుంచి రెపో రేట్లు పెంచుతూ వస్తోంది. గత ఏడాది మే నెల నుంచి పెంచుకుంటూనే వస్తోంది.

RBI keeps Repo rate unchanged at 6.5 Percent

గత ఆర్థిక సంవత్సరంలో ఆర్‌బీఐ రెపో రేటును వరుసగా 6 సార్లు పెంచింది. రెపో రేటు అంటే ఆర్బీఐ బ్యాంకులకు రుణాలు ఇచ్చే రేటు. ఆర్బీఐ రెపో రేటు పెంచితే బ్యాంకుల కూడా వడ్డీ రేట్లు పెంచుతాయి. దీంతో రుణాలు తీసుకున్న వారు ఈఎంఐ ఎక్కువ చెల్లించాల్సి వస్తుంది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+