RBI Interest Rate August 2025: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా MPC మీటింగ్ మూడు రోజుల సమావేశంలో కీలక నిర్ణయం తీసుకుంది. చివరి రోజు అంటే నేడు జరిగిన సమావేశంలో రెపో రేటును 5.5 శాతం వద్ద స్థిరంగా ఉంచుతున్నట్లు ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ప్రకటించారు. వడ్డీ రేట్లలో ఎటువంటి మార్పు చేయలేదు. రెపో రేటులో ఎటువంటి మార్పు లేనందున..మీ రుణం చౌకగా మారదు లేదా EMI భారం తగ్గదు. అంటే, మీరు ప్రస్తుతం ఉన్న రేటుతోనే రుణం తీసుకోవలసి ఉంటుంది.
ఆర్బీఐ MPC సమావేశం ఆగస్టు 4, 5, 6 తేదీలలో జరిగింది. ఈ సమావేశంలో దేశ ఆర్థిక పరిస్థితులను జాగ్రత్తగా సమీక్షించిన తరువాత ఈ నిర్ణయం తీసుకున్నారు. MPCలోని ఆరుగురు సభ్యులు ఏకగ్రీవంగా రెపో రేటును 5.5 శాతం వద్ద కొనసాగించడానికి ఓటు వేశారని గవర్నర్ మల్హోత్రా తెలిపారు. రెపో రేటు అనేది రిజర్వ్ బ్యాంక్ ఇతర బ్యాంకులకు రుణాలు ఇచ్చే రేటు. కాగా జూన్‌లో జరిగిన చివరి విధాన సమావేశంలో, MPC రెపో రేటును 50 బేసిస్ పాయింట్లు తగ్గించి 5.5 శాతానికి తీసుకువచ్చింది ఆర్బీఐ. ద్రవ్యోల్బణం తగ్గుతుండటమే దీనికి కారణంగా చెప్పుకోవచ్చు.

వడ్డీ రేట్లను మార్చకపోవడానికి 5 కారణాలు
ద్రవ్యోల్బణం తగ్గడం: ద్రవ్యోల్బణం తగ్గిన కారణంగా రిజర్వ్ బ్యాంక్ ఈ సారి వడ్డీ రేట్లను మార్చలేదు. భారతదేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం నిరంతరం తగ్గుతూ వస్తోంది. ఇది ఇప్పుడు ఆరు సంవత్సరాలకు పైగా కనిష్ట స్థాయికి చేరుకుంది. ఆర్థిక శాఖ గణాంకాల ప్రకారం.. వినియోగదారుల ధరల సూచిక (CPI) ఆధారంగా వార్షిక ద్రవ్యోల్బణం రేటు జూన్‌లో 2.10 శాతంగా ఉంది. మే 2025తో పోలిస్తే ఇది 72 బేసిస్ పాయింట్ల తగ్గుదలగా ఉంది. ఇక జనవరి 2019 తర్వాత ఇది అత్యల్ప CPI ద్రవ్యోల్బణ రేటుగా చెప్పుకోవచ్చు. CPI అనేది వస్తువుల ధరలు ఎంత పెరిగాయో చూపించే సూచిక.
తగ్గిన ఆహార పదార్థాల ధరలు: దేశంలో ఆహార వస్తువుల ధరలు కూడా తగ్గాయి. జూన్‌లో వినియోగదారుల ఆహార ధరల సూచిక (CFPI) ద్రవ్యోల్బణం రేటు (-) 1.06 శాతంగా ఉంది. గ్రామాల్లో ఆహార ద్రవ్యోల్బణం (-) 0.92 శాతంగా ఉండగా, నగరాల్లో ఇది (-) 1.22 శాతంగా ఉంది. అంటే గత సంవత్సరంతో పోలిస్తే ఆహార పదార్థాలు చాలా వరకు చౌకగా మారాయి.
తగ్గిన టోకు ద్రవ్యోల్బణం: ఈ సారి టోకు ద్రవ్యోల్బణం కూడా ప్రతికూలంగా మారింది. జూన్‌లో టోకు ధరల సూచిక (WPI) (-) 0.13 శాతంగా ఉండగా.. మేలో ఇది 0.39 శాతంగా ఉంది. ఆహార పదార్థాలు, మినరల్ ఆయిల్స్, బేసిక్ మెటల్స్, ముడి పెట్రోలియం, సహజ వాయువు ధరలు తగ్గడమే WPI తగ్గడానికి కారణమని వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలిపింది. WPI అనేది టోకు మార్కెట్లో వస్తువుల ధరలు ఎంత పెరిగాయో చూపించే కొలత.
ఆర్థిక వ్యవస్థలో వృద్ధి : ఈ ఏడాది రుతుపవనాలతో పాటుగా రాబోయే పండుగ సీజన్ ఆర్థిక కార్యకలాపాలను పెంచుతాయని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ ఈ సమావేశంలో అన్నారు.రాబోయే రోజుల్లో మార్కెట్ పుంజుకోవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. మధ్యస్థ కాలంలో భారత ఆర్థిక వ్యవస్థ బలమైన వృద్ధిని నమోదు చేస్తుందని అన్నారు. ప్రపంచ వాణిజ్యంలో అనిశ్చితి ఉన్నప్పటికీ, ప్రభుత్వం, ఆర్‌బిఐ యొక్క సహాయక విధానాల నుండి దీనికి మద్దతు లభిస్తుందని తెలిపారు.
గతంలో 100 బేసిస్ పాయింట్ల తగ్గింపు: ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి రిజర్వ్ బ్యాంక్ రెపో రేటును 100 బేసిస్ పాయింట్లు తగ్గించింది. ఈ తగ్గింపు గురించి ఆర్‌బిఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ప్రస్తావించారు. దాని ప్రభావం ఇప్పటికీ ఆర్థిక వ్యవస్థపై కనిపిస్తోందన్నారు. ఇప్పటికే చాలా తగ్గింపుల చేశామని ఇప్పుడు వడ్డీ రేట్లను మరింత తగ్గించడం సముచితంగా భావించడం లేదని తెలిపారు.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications