For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

RBI: ఆర్బీఐ ద్రవ్య విధాన సమీక్ష సమావేశం.. వడ్డీ రేటు పెంపు ఉంటుందా..!

|

నేటి నుంచి ఆర్బీఐ ద్రవ్య విధాన సమీక్ష సమావేశం జరగనుంది. ఈసారి ఆర్బీఐ రుణ రేట్లను 25-35 bps పెంచే అవకాశం ఉందని నిపుణుల అభిప్రాయపడుతున్నారు. దేశీయ అంశాలతో పాటు, US ఫెడరల్ రిజర్వ్ నిర్ణయాలను బట్టి ఆర్‌బిఐ కమిటీ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఇంతకుముందు కీలక వడ్డీ రేట్లను నాలుగు సార్లు 75 బేసిస్ పాయింట్ల చొప్పున పెంచింది. భారత రిజర్వ్ బ్యాంక్ కూడా మే నుంచి రెపో లేదా బెంచ్‌మార్క్ లెండింగ్ రేట్లను 190 బేసిస్ పాయింట్లు పెంచింది.

ద్రవ్యోల్బణం ఇప్పటికీ 6% టార్గెట్ బ్యాండ్ కంటే ఎక్కువగా ఉన్నందున ఆర్థిక మార్కెట్లు కమిటీ వైఖరిని ఆసక్తిగా గమనిస్తున్నాయి. బ్యాంక్ ఆఫ్ బరోడాలో చీఫ్ ఎకనామిస్ట్ మదన్ సబ్నవిస్, MPC రేటు పెంపుతో కొనసాగుతుందని అభిప్రాయపడ్డారు. అయితే వడ్డీ రేటు పెంపు తక్కువగా ఉండొచ్చని చెప్పారు. "GDP వృద్ధి మందగించడం, ద్రవ్యోల్బణం 6 శాతం కంటే ఎక్కువగా ఉన్న నేపథ్యంలో RBI ద్రవ్య విధానాన్ని సవరిస్తుంది. MPC ఈసారి రేటు పెంపుతో కొనసాగుతుందని మేము విశ్వసిస్తున్నాము, అయినప్పటికీ పరిమాణం తక్కువగా ఉంటుంది " అని ఓ అధికారి చెప్పారు.

 RBI is likely to raise lending rates by 25-35 bps in the monetary policy review meeting

English summary

RBI: ఆర్బీఐ ద్రవ్య విధాన సమీక్ష సమావేశం.. వడ్డీ రేటు పెంపు ఉంటుందా..! | RBI is likely to raise lending rates by 25-35 bps in the monetary policy review meeting

RBI monetary policy review meeting will be held from today. This time RBI is likely to raise lending rates by 25-35 bps, according to experts.
Story first published: Monday, December 5, 2022, 11:05 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X