ఆర్‌బిఐ పెద్ద గిఫ్ట్.. తగ్గనున్న రెపో రేటు.. ఇక హోమ్, కార్ లోన్స్ చౌకగా..?
మీరు ఇల్లు లేదా కారు లోన్ తీసుకోవాలని ఆలోచిస్తున్నారా... అయితే ఈ వార్త మీకోసమే. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరోసారి రెపో రేటులో పెద్ద కోతను పరిశీలిస్తోంది. ఈ సంవత్సరం జూన్ నుండి దీపావళి వరకు రిజర్వ్ బ్యాంక్ (RBI) మూడు ద్రవ్య విధాన కమిటీ (MPC) సమావేశాలు జరగనున్నాయి, ఈ తరుణంలో రెపో రేటును తగ్గించవచ్చు. ఈ కోత 0.50 నుండి 0.75 శాతం వరకు ఉండవచ్చని నివేదికలలో పేర్కొన్నాయి. రెపో రేటులో ఇంత తగ్గింపు ఉంటే సామాన్యులకు పెద్ద రిలీఫ్ లభిస్తుంది.

సామాన్యుడికి భారీ రిలీఫ్ : మీడియా నివేదికల ప్రకారం ఆర్‌బిఐ ద్రవ్య విధాన కమిటీ వచ్చే సమావేశం జూన్ 4-6 వరకు జరగనుంది, ఈ సమావేశంలో సామాన్యులకు ఉపశమనం కలిగించడానికి పెద్ద నిర్ణయాలు తీసుకోవచ్చు అలాగే రెపో రేటును దాదాపు 0.25% తగ్గించవచ్చు. దీని తరువాత ఆగస్టు 5 నుండి 7 వరకు లేదా సెప్టెంబర్ 29 నుండి అక్టోబర్ 1 వరకు జరిగే సమావేశంలో 0.25 శాతం నుండి 0.50 శాతం వరకు కోత ఉంటుందని భావిస్తున్నారు. సమాచారం ప్రకారం ఫిబ్రవరి నుండి RBI రెపో రేటును తగ్గించడం ప్రారంభించింది. అప్పటి నుండి రెండు సమావేశాలలో 0.50% కోత వచ్చింది. ఈ కారణంగా రెపో రేటు 6%కి తగ్గింది.
వడ్డీ ఎంత తగ్గుతుంది: ఈసారి దీపావళికి ముందు సామాన్యులకు పెద్ద ఉపశమనం లభిస్తుందని, ఆర్‌బిఐ రెపో రేటు 0.75% వరకు తగ్గించవచ్చని చెబుతున్నారు. ప్రస్తుతం రెపో రేటు 6% వద్ద ఉంది, దీపావళి నాటికి ఇది 5.25%కి తగ్గవచ్చు.
చౌకగా మారనున్న హోమ్ అండ్ కారు లోన్స్ : సింపుల్'గా అర్థం చేసుకోవాలంటే రెపో రేటు అంటే ఆర్‌బిఐ బ్యాంకులకు రుణాలు ఇచ్చే వడ్డీ రేటు, తరువాత బ్యాంకులు కొంత వడ్డీని కలపడం ద్వారా కస్టమర్లకు లైన్స్ ఇస్తాయి. ఇలాంటి పరిస్థితిలో రెపో రేటు తగ్గితే మీ లోన్ EMI కూడా తగ్గుతుంది ఇంకా మీ హోమ్ లోన్ అండ్ కారు లోన్ చౌకగా మారుతుంది.
వడ్డీ రేటు తగ్గింపు వెనుక గల కారణం ఏమిటి: SBI సెక్యూరిటీస్ డిప్యూటీ వైస్ ప్రెసిడెంట్ సన్నీ అగర్వాల్ ప్రకారం, అన్ని అంశాలు రేటు తగ్గింపు వైపు చూపిస్తున్నాయి. ఇంకా పరిస్థితులు కూడా సాధారణంగానే ఉంటాయని భావిస్తున్నారు. GDP వృద్ధి ఆరోగ్యకరంగా ఉంది అలాగే స్థిరంగా కూడా ఉంది. ద్రవ్యోల్బణం అదుపులో ఉంది కాబట్టి ఈ కారణంగా కూడా రేట్లు మరింత తగ్గవచ్చు.


Click it and Unblock the Notifications