For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రూపాయి, బాండ్ మార్కెట్ ట్రేడింగ్ సమయం పెంపు

|

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) రూపాయి, బాండ్ మార్కెట్ ట్రేడింగ్ సమయాన్ని పెంచుతోంది. కరోనా ఆంక్షలు క్రమంగా సడలిస్తుండటంతో ట్రేడింగ్ సమయాన్ని పెంచాలని నిర్ణయించింది. ఫారెన్ కరెన్సీ, రూపాయి మార్కెట్(ఫారెక్స్ డెరివేటివ్స్), గవర్నమెంట్ సెక్యూరిటీలు, కమర్షియల్ పేపర్, సెర్టిఫికెట్ ఆఫ్ డిపాజిట్) సమయాన్ని మరో 1.5 గంటలు పెంచనుంది. ప్రస్తుతం రూపాయి మార్కెట్ 3.30 నిమిషాలకు ముగుస్తోంది. అంతకుముందు 2 గంటలకు క్లోజ్ అయ్యేది. రూపాయి మార్కెట్ ఓపెనింగ్ సమయం ఉదయం 10.

సవరించిన ఈ సమయం నవంబర్ 9, 2020 నుండి అమలులోకి రానుంది. లాక్ డౌన్ ఆంక్షల సడలింపుల నేపథ్యంలో నియంత్రిత మార్కెట్ల వాణిజ్య సమయాన్ని దశల వారీగా పునరుద్ధరించాలని నిర్ణయించినట్లు ఆర్బీఐ తన ప్రకటనలో తెలిపింది. మార్కెట్ సమయాలు ఈ కింది విధంగా...

RBI increases trading hours for rupee and bond markets

కాల్, నోటీస్, టర్మ్ మనీ ప్రస్తుత సమయం ఉదయం గం.10 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు ఉన్నాయి. నవంబర్ 9న తేదీ నుండి మధ్యాహ్నం 3.30 గంటల వరకు ఉంటుంది.
గవర్నమెంట్ సెక్యూరిటీస్ మార్కెట్ రెపో మధ్యాహ్నం గం.2 నుండి గం.2.30కు పెంచింది.
ట్రై పార్టీ రెపో (గవర్నమెంట్ సెక్యూరిటీస్) సమయం ప్రస్తుతం ఉదయం 10 నుండి మధ్యాహ్నం 2 వరకు ఉండగా, మధ్యాహ్నం 3 గంటల వరకు పెంచింది.

కమర్షియల్ పేపర్ అండ్ సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్ సమయం మధ్యాహ్నం 2 గంటల వరకు కాగా, దీనిని గం.3.30 వరకు పెంచింది. కార్పోరేట్ బాండ్స్ రెపోను మధ్యాహ్నం గం.2 నుండి మధ్యాహ్నం గం.3.30 వరకు పెంచింది. గవర్నమెంట్ సెక్యూరిటీస్, ఫారెన్ కరెన్సీ, ఇండియన్ రూపాయి, రూపాయి ఇంటరెస్ట్ డెరివేటివ్స్ ట్రేడింగ్‌ను కూడా మధ్యాహ్నం గం.3.30 వరకు పొడిగించింది.

English summary

రూపాయి, బాండ్ మార్కెట్ ట్రేడింగ్ సమయం పెంపు | RBI increases trading hours for rupee and bond markets

The Reserve Bank of India has increased trading hours for the rupee and bond markets following easing COVID-19 lockdown restrictions. The trading hours for foreign currency and rupee market including forex derivatives, government securities, commercial paper and certificates of deposit has been increased by 1.5 hours.
Story first published: Monday, November 2, 2020, 20:00 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X