For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆర్బీఐ ప్రకటనతో ఇన్వెస్టర్లలో జోష్

|

పీర్ టు పీర్ రుణ వితరణ రంగంలో కొత్త జోష్ నెలకొంది. భారత రిజర్వ్ బ్యాంక్ (ఆర్ బీ ఐ ) తాజాగా చేసిన ప్రకటనే ఇందుకు ప్రధానమైన కారణం. పీర్ టు పీర్ (పీ2పీ) రుణ దాతలకు సంబందించిన పెట్టుబడి పరిమితిని ఆర్బీఐ 50 లక్షల రూపాయలకు పెంచింది. ఇది ఈ రంగానికి ఎంతో ఉపశమనం కలిగించే వార్త. ఆర్బీఐ తాజా నిర్ణయం మేరకు అన్ని పీ2పీ ప్లాటుఫార్మ్స్ ఇన్వెస్టర్లు ఈ మేరకు పెట్టుబడి పెట్టడానికి అవకాశం ఉంటుంది. దీని వల్ల మరింత ఎక్కువ మంది వీటి ద్వారా రుణాలను పొందడానికి అవకాశం ఏర్పడుతుంది. ఫలితంగా ఈ రంగం మరింతగా విస్తరిస్తుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం అన్ని ప్లాటుఫార్మ్స్ పై రుణాలు తీసుకునే వారికి, ఇచ్చే వారికీ సంబంధించిన రుణ పరిమితి 10 లక్షల రూపాయలుగా ఉంది.

15కు పైగా కంపెనీలు

* పీ2పీ పరిశ్రమ క్రమంగా వృద్ధి చెందుతోంది. ప్రస్తుతం ఆర్బీఐ వద్ద 15కు పైగా పీ2పీ కంపెనీలు నమోదయ్యాయి. ఈ డిజిటల్ ప్లాటుఫార్మ్స్ ద్వారా రుణం అవసరం ఉన్న వారు పొందవచ్చు. ఈ ప్లాటుఫార్మ్స్ రుణదాతలు, రుణ గ్రహీతలకు మధ్య మార్కెట్ ప్లేస్ మాదిరిగా పని చేస్తుంది.
* ఈ రంగంలోని కంపెనీలు గత కొంత కాలంగా ఈ పరిమితులను పెంచమంటూ పరిశ్రమ డిమాండ్ చేస్తోంది.

RBI increases peer to peer lending limit

* పరిశ్రమవృద్ధికి అనుగుణంగా పరిమితి పెంపునకు సంబంధించి పీ2పీ కంపెనీలు ఆర్బీఐ కి లేఖ రాశాయి. అంతేకాకుండా ఆర్థిక మంత్రిని కూడా కలిసి పరిమితిని పెంచమంటూ విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలోనే ఆర్బీఐ తాజా నిర్ణయం తీసుకుంది.
* పరిశ్రమ వృద్ధి సామర్థ్యం, ఈ రంగంపై ఆర్బీఐ కి ఉన్న విశ్వాసమే పరిమితి పెంపునకు దారితీసింది పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.

ప్రత్యామ్నాయం

* ఆర్బీఐ నిధుల పరిమితిని పెంచడం పరిశ్రమకు ఎంతో సానుకులమైనదని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.
* ఈ పరిశ్రమ అటు రుణదాతలు, ఇటు రుణగ్రహితలకు ప్రత్యామ్నాయ బ్యాంకింగ్ సొల్యూషన్ గా ఉందని అంటున్నారు.

పెట్టుబడుల జోరు...

* వాస్తవానికి పరిశ్రమ వర్గాలు నిధుల పరిమితిని కోటి రూపాయలకు పెంచాలని కోరాయట.
* అయితే ఇందులో సగం మేరకు పెంచినప్పటికీ వెంచర్ క్యాపిటల్, ప్రైవేట్ ఈక్విటీ పెట్టుబడులు పెరుగుతాయని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.

English summary

ఆర్బీఐ ప్రకటనతో ఇన్వెస్టర్లలో జోష్ | RBI increases peer to peer lending limit

Reserve bank of india recently raised peer to peer lending limit to Rs.50 lakh. It is a major relief to the industry. With the latest move the industry will grow to new levels.
Story first published: Sunday, December 8, 2019, 20:57 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X