UPI Payments: డిజిటల్ చెల్లింపులు వేగంగా విస్తరిస్తున్న తరుణంలో భారత ఆర్థిక వ్యవస్థలో అందుకు అవసరమైన నిర్ణయాలను ప్రభుత్వం సకాలంలో తీసుకుంటోంది.
ఈ క్రమంలో ఆఫ్‌లైన్ UPI లైట్ లావాదేవీ పరిమితిని రూ.200 నుంచి రూ.500కి పెంచాలని భారతీయ రిజర్వ్ బ్యాంక్ నిర్ణయించింది. ఈ లావాదేవీలు పూర్తి చేయటానికి వినియోగదారులు ఎలాంటి పాస్ వర్డ్ లేదా పిన్ ఎంటర్ చేయాల్సిన అవసరం ఉండదు. మానిటరీ పాలసీ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు.

డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడానికి యూపీఐ లైట్ సదుపాయం అందుబాటులోకి తీసుకురావటం జరిగింది. దీని కింద మీరు బ్యాంకు ద్వారా వెళ్లకుండా మాత్రమే వాలెట్ ఉపయోగించి చెల్లింపు చేయవచ్చు. దీనికోసం ముందుకు మీరు వాలెట్‌కు యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. PhonePe, Paytm వంటి ప్లాట్‌ఫారమ్‌లు ఈ సేవను ప్రారంభించాయి. ఈ సౌకర్యం కింద యూజర్లు ప్రతి రోజు రూ.2,000 వరకు లావాదేవీలు చేయవచ్చు.

కీలక వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పు లేకుండా కొనసాగించాలని నిర్ణయించినట్లు రిజర్వు బ్యాంక్ గవర్నర్ ప్రకటించారు. 2024 ఆర్థిక సంవత్సరానికి రిటైల్ ద్రవ్యోల్బణం అంచనాలను 5.1% నుంచి 5.4% శాతానికి పెంచుతున్నట్లు వెల్లడించింది. అలాగే FY24లో డీజీపీ వృద్ధి 6.5 శాతంగా, Q1లో 8 శాతం, Q2లో 6.5 శాతం, Q3లో 6 శాతం, Q4లో 5.7 శాతంగా అంచనా వేస్తున్నట్లు శక్తికాంత దాస్ తెలిపారు.


Click it and Unblock the Notifications