NRI News: ప్రవాస భారతీయులకు శుభవార్త.. అత్యధిక వడ్డీ ఇస్తున్న డిపాజిట్లివే.. డోన్ట్ మిస్
Fixed Deposits: ఎన్నాళ్లు గడిచినా దేశంలో ప్రజల నమ్మకం బ్యాంకు డిపాజిట్లమై మాత్రం తగ్గనేలేదు. బ్యాంక్ అందించే వడ్డీ రేటు కంటే బయట అధిక వడ్డీ వచ్చినప్పటికీ భద్రత, గ్యారెంటీ లేకపోవటంతో చాలా మంది ప్రజలు వాటిపై మక్కువ చూపటం తగ్గిస్తున్నారు. ఈ క్రమంలో విదేశాల్లో నివసిస్తున్న భారతీయులకు బ్యాంకులు భారీ వడ్డీ ఆఫర్ చేస్తున్నారు.
ప్రధానంగా విదేశాల్లో నివసించే భారతీయులు ఎక్కువగా ఫిక్స్‌డ్ డిపాజిట్లలో పెట్టుబడులు పెట్టడానికి ఇష్టపడుతుంటారు. ఈ పెట్టుబడి ఎంపిక వినియోగదారునికి అనుకూలమైనది.. పైగా డబ్బుకు భద్రతను, హామీతో కూడిన రాబడిని అందిస్తుంది. డిసెంబర్ ఎంపీసీలో రిజర్వ్ బ్యాంక్ కరెన్సీ నాన్-రెసిడెంట్ అకౌంట్ FCNR(B) డిపాజిట్లపై వడ్డీ రేటు పరిమితిని ఓవర్ నైట్ ఆల్టర్నేట్ రిఫరెన్స్ రేటు (ARR)కి పెంచింది. దీంతో 1- 3 ఏళ్ల మధ్య మెచ్యూరిటీలకు 400 బేసిస్ పాయింట్లను పెంచింది.

వాస్తవానికి రిజర్వు బ్యాంక్ రేటును భారీగా పెంచటానికి అసలు కారణం విదేశీ భారతీయుల నుంచి పెట్టుబడులను ఆకర్షించటం ద్వారా విదేశీ కరెన్సీ రాబడిని పెంచాలని. మార్చిన రేట్లు మార్చి 2025 వరకు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. దీంతో డిసెంబర్ 6, 2024 నుంచి విదేశీ పెట్టుబడిదారుల డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచాలని రిజర్వు బ్యాంక్ నిర్ణయించింది.
ఫారెన్ కరెన్సీ నాన్ రెసిడెంట్ ఖాతా అంటే ఏమిటి?
విదేశీ కరెన్సీ నాన్-రెసిడెంట్ బ్యాంక్ ఖాతా వ్యక్తులు దేశంలో స్థిర డిపాజిట్‌ను 1-5 ఏళ్ల వరకు ఉచితంగా మార్చుకోగలిగే విదేశీ కరెన్సీల్లో ఉంచుకోవడానికి వీలు కల్పిస్తుంది. ఇలా విదేశీ కరెన్సీలో ఖాతాను నిర్వహించడం ద్వారా డిపాజిట్ కాలవ్యవధిలో ఎదురయ్యే కరెన్సీ హెచ్చుతగ్గుల నుంచి డిపాజిట్ చేసిన నిధులను ప్రవాస భారతీయులు కాపాడుకోవచ్చు. నాన్-రెసిడెంట్ ఎక్స్‌టర్నల్ బ్యాంక్ ఖాతా మాదిరిగానే ఈ ఖాతాలో ఉన్న నిధులు, వచ్చే వడ్డీ రెండూ భారతదేశంలో పన్నుల నుండి మినహాయింపుకు అర్హులు.
ఈ ఖాతాల ప్రయోజనాలను పరిశీలిస్తే.. విదేశాల్లో ఉన్న భారతీయులు అక్కడ సంపాదించిన డబ్బును ఫారెన్ కరెన్సీ నాన్ రెసిడెంట్ ఖాతాలో విదేశీ కరెన్సీలోనే సేవ్ చేసుకోవటానికి వెసులుబాటు ఉంటుంది. అవసరమైనప్పుడు ఖాతాదారులు అసలు మొత్తంతో పాటు వడ్డీని స్వదేశానికి తరలించవచ్చు. సంపాదించిన వడ్డీ భారతదేశంలో పన్ను మినహాయింపును కూడా పొందుతుంది. ఈ ప్రయోజనాన్ని ప్రవాస భారతీయులు తెలివిగా వినియోగించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. దీనికి సంబంధించిన వివరాల కోసం ఏదైనా ప్రభుత్వ లేదా ప్రైవేటు బ్యాంకును సంప్రదించటం ద్వారా పూర్తి వివరాలు తెలుసుతోవచ్చు.


Click it and Unblock the Notifications