RBI News: ఆ 5 బ్యాంకులపై కన్నెర్ర చేసిన రిజర్వు బ్యాంక్.. దిగ్గజ ప్రైవేట్ బ్యాంక్ కూడా..

RBI Penalty: దేశీయ బ్యాంకింగ్ వ్యవస్థను నియంత్రించే సంస్థ రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా. గత కొన్ని నెలలుగా ఆర్బీఐ చిన్న తప్పులను సైతం అస్సలు ఉపేక్షించటం లేదు. ఎప్పటికప్పుడు సదరు సంస్థలపై చర్యలు తీసుకుంటోంది.

తాజాగా నవంబర్ 30న దేదశంలోనే అతిపెద్ద ప్రైవేటు బ్యాంక్ గా కొనసాగుతున్న హెచ్డీఎఫ్సీ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ అమెరికాతో పాటు మరో మూడు కో-ఆపరేటివ్ బ్యాంకులపై నిబంధనలు ఉల్లంఘించినందుకు చర్యలు చేపట్టింది. NRIల నుంచి డిపాజిట్లు సేకరణ విషయంలో రూల్స్ అతిక్రమించినందుకు హెచ్డీఎఫ్సీ, బ్యాంక్ ఆఫ్ అమెరికాలపై రూ.10,000 చొప్పున ఫైనా విధించింది. ఇవి ఫెమా చట్టాలను ఉల్లంఘించాయని సెంట్రల్ బ్యాంక్ పేర్కొంది.

RBI imposed penalty over hdfc, bank of america and cooperative banks, know

మానిటరీ పెనాల్టీ విధించటానికి ముందర రిజర్వు బ్యాంక్ సదరు సంస్థలకు ముందుగా షోకాజ్ నోటీసులు జారీ చేసింది. దీనికి సదరు బ్యాంకింగ్ సంస్థలు వ్రాతపూర్వకంగా బదులిచ్చిన తర్వాత చర్యలు వచ్చాయి. ఇక కో-ఆపరేటివ్ బ్యాంక్స్ విషయానికి వస్తే ఇతర బ్యాంకులతో డిపాజిట్లను ఉంచటం విషయంపై గుజరాత్‌లోని ధృంగాధ్ర పీపుల్స్ కో-ఆపరేటివ్ బ్యాంక్‌పై రూ.లక్ష జరిమానా విధించబడింది.

అలాగే నిబంధనలు పాటించని కారణంగా బీహార్‌లోని పాట్లీపుత్ర సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్‌పై రెగ్యులేటర్ రూ.1.50 లక్షల జరిమానా విధించింది. చివరిగా గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లోని మండల్ నాగరిక్ సహకారి బ్యాంక్‌కు నిబంధనలు పాటించనందుకు రిజర్వు బ్యాంక్ రూ.1.50 లక్షల జరిమానాను విధించింది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+