RBI: గత కొన్ని నెలలుగా రిజర్వు బ్యాంక్ దేశంలోని సహకార బ్యాంకులపై వరుసగా చర్యలు తీసుకుంటోంది. తాజాగా ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన బ్యాంకులతో పాటు మెుత్తం ఎనిమిదింటిపై చర్యలు చేపట్టింది. పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

ఆంధ్రప్రదేశ్ బ్యాంక్..
ఏపీలోని విశాఖపట్నం కో-ఆపరేటివ్ బ్యాంక్, విశాఖపట్నం బ్రాంచ్ పై రెగ్యులేటరీ నిబంధనలలో లోపాల కారణంగా RBI రూ.55 లక్షల జరిమానా విధించినట్లు సోమవారం ప్రకటించింది. దీనికి తోడు.. ది నెల్లూరు కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్, గాంధీ నగర్, నెల్లూరు జిల్లా; కాకినాడ కో-ఆపరేటివ్ టౌన్ బ్యాంక్ లిమిటెడ్, కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాలపై ఒక్కోదానికి రిజర్వు బ్యాంక్ రూ.10 లక్షల జరిమానా విధించింది.

జరిమానాలకు కారణం..
ఆదాయ గుర్తింపు, ఆస్తుల వర్గీకరణ, కేటాయింపు, హౌసింగ్ స్కీమ్‌ల ఫైనాన్స్‌కు సంబంధించిన ఆదేశాలను ఉల్లంఘించినందుకు విశాఖపట్నం కో-ఆపరేటివ్ బ్యాంక్ పై చర్యలు తీసుకున్నట్లు రిజర్వు బ్యాంక్ తన ప్రకటనలో వెల్లడించింది.

తమిళనాడు, కేరళలో..
RBI తమిళనాడులోని తిరుచిరాపల్లిలోని కైలాసపురంలోని భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ ఎంప్లాయీస్ కో-ఆపరేటివ్ బ్యాంక్‌పై రూ.10 లక్షల జరిమానా విధించింది. ది ఒట్టపాలెం కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ పై రూ.5 లక్షలు. ఇదే సమయంలో తెలంగాణ, హైదరాబాద్ లో ఉన్న ది దారుస్సలాం కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ రూ.10 లక్షలను జరిమానాగా విధించింది.

ఉత్తరప్రదేశ్‌లో..
ఉత్తరప్రదేశ్‌లోని ప్రతాప్‌గఢ్‌లోని నేషనల్ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్‌పై రూ.5 లక్షల జరిమానా విధించబడింది. ఇదే క్రమంలో కేంద్రపారా అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్‌పై రిజర్వు బ్యాంక్ రూ.లక్ష జరిమానా విధించింది. రెగ్యూలేటరీ నియమాలను ఉల్లంఘింటిన లేదా పాటించని పక్షంలో దానికి అనుగుణంగా చర్యలు తీసుకున్నట్లు భారతీయ సెంట్రల్ బ్యాంక్ తన పేర్కొంది. ఈ ప్రభావం సదరు బ్యాంకులకు సంబంధించిన ఖాతాదారులతో నిర్వహించిన ట్రాన్సాక్షన్లకు సంబంధం ఉండదని స్పష్టం చేసింది.
.


Click it and Unblock the Notifications